టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపుకు ఎట్టకేలకు తెరపడింది. ఈ ఏడాది చివరిలోనే గ్రాండ్ లెవెల్ హరిహర వీరమల్లు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాకు నిన్న మొన్నటి వరకు హైప్ అంతంత మాత్రంగానే ఉన్నా.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రికల్ ట్రైలర్‌తో ఒక్కసారి ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. బాబిడియోల్ నెగిటివ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాను ఔరంగ జేబ్ నాటి చారిత్రక కథగా కూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అనాధగా కనిపించనన్నాడు.
కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడమే లక్ష్యంగా కథ తెరకెక్కనున్నట్లు ట్రైలర్‌తో అర్థమవుతుంది. విష్ణు, శివుడు కలిపిన అవతారంగా వీరమల్లును డిజైన్ చేసినట్లు టీం చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు పోటీగా నిర్మాత అల్లు అరవింద్ మరో సినిమాను దించుతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. అది కూడా ఓ డబ్బింగ్ మూవీ కావడం.. కన్నడలో బిగ్ ప్రొడక్షన్ హౌస్ భొంబాలే ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మహాభారత నరసింహం సినిమాని తెలుగులో రిలీజ్ చేయనున్నరట. అది కూడా అల్లు అరవింద్ కు చెందిన గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్లో తెలుగులో రిలీజ్ కానుందని సమాచారం.
అయితే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు టాక్. దీంతో కావాలనే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు పోటీగా ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఆ సినిమాలో త్రీడీ వర్షన్లో ఆడియన్స్ ముందుకు తీసుకురానన్నారు. కన్నడ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలో సినిమా రిలీజ్ కానుంది. దశావతారంలో ఒక అవతారంగా మహావతార నరసింహ మూవీ యానిమేషన్ ప్రధానంగా రూపొందించారు. విష్ణువు దశావతారాల్లో ఒకటైన అవతారం.. ఆయన పురాణ కథను బేస్ చేసుకుని యానిమేషన్ మూవీని తెరకెక్కించారు. తెలుగులో గీత డిస్ట్రిబ్యూషన్ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.