కన్నప్ప, వీరమల్లు కష్టాలే అఖండ 2కి కూడానా.. బాలయ్యకు తిప్పలు తప్పవా..!

ప్రస్తుతం స్టార్ హీరోల భారీ సినిమాలు ముందుగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కు రావడం లేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా షూటింగ్ టైం కు జరిగిన విఎఫ్‌ఎక్స్ వర్క్ కారణాలతో సినిమా రిలీజ్ డేట్‌లు వాయిదా పడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప సినిమా అయితే ఏకంగా ఆరు నెలలు ఆలస్యం అవుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన క్రమంలో మళ్లీ రి వర్క్‌ చేస్తూ సినిమాను ఆలస్యం చేశారు. ఇక హరిహర వీర‌మ‌ల్లు సినిమా గ‌త‌ నెలలో రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇదే విఎఫ్ఎక్స్ కారణంగా సినిమా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటివరకు.. విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి.

Akhanda 2 (Akhanda 2 - Thaandavam) 2025 | Akhanda 2 Telugu Movie: Release Date, Cast, Story, Ott, Review, Trailer, Photos, Videos, Box Office Collection – Filmibeat

ఇక తాజాగా.. ఈ జాబితాలో బాలయ్య‌ అఖండ 2 సినిమా చేరిందని సమాచారం. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ.. సెప్టెంబర్ వరకు పూర్తయ్యే అవకాశం లేదట. అంతేకాదు.. ఈ నెలఖరు వరకు అఖండ 2 షూటింగ్ కొనసాగుతూనే ఉంటుంది. దీంతో విఎఫ్ఎక్స్‌ ఆగస్టులో ముగించాలని భావించిన అది వర్క్ అవుట్ కావడం లేదని.. తాజాగా మూవీ టీం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో డైరెక్టర్‌కి విఎఫ్ఎక్స్‌ కంపెనీ వాళ్ళు దీనిని వివరించినట్లు సమాచారం. దీంతో బోయపాటి సైతం షూటింగ్ మెల్లగా లాగుతున్నాడట. సెప్టెంబర్ కు రావాల్సిన సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బాల‌య్య‌ అభిమానులతో పాటు.. సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Akhanda 2: Balayya's unseen look to leave fans stunned

ఈ క్రమంలోనే విజువల్స్‌లో ఎలాంటి లోపం ఉండకూడదని ఆడియన్స్‌కు మంచి అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటికే వచ్చిన ఆఖండ ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వల్‌గా వస్తున్న మూవీ కావడం.. అది కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్క‌నున్న క్రమంలో ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇక హిందుత్వంతో కొనసాగిన అఖండ కు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2లో అంతకుమించి సనాతన ధర్మం చుట్టూ స్టోరీ నడుస్తుందట. ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తుండగా.. ప్రఖ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్‌లుగా మెరవనున్నారు. హర్షాలి మల్హోత్ర కీలకపాత్రలో మెర‌వ‌నుంది. డిసెంబర్ 18న సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే.. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.