టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో నిండిపోయింది. ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలో ఆయన తన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.. కోటా శ్రీనివాస మరణం పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆవేదనను వెల్లడించాడు. దశాబ్దాలుగా ఆయనతో వ్యక్తిగత పరిచయం.. ఇరుగుపొరుగు ఉన్న సమయంలో వారిమధ్య ఏర్పడిన దృఢమైన సంబంధం గురించి తనికెళ్ల భరణి గుర్తు చేసుకున్నాడు. కోటా శ్రీనివాసరావు నటన ప్రతిభ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నట్టు చెప్పుకొచ్చిన ఆయన.. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కోట అంచెలంచెలుగా ఎదిగి సినీ శిఖరాన్ని అధిరోహించాడని.. తన సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమంటూ తనికెళ్ల భరణి చెప్పుకొచ్చాడు.
విలన్ పాత్రల్లో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఆయన.. ప్రతి వేషంలోనూ 100% ఎఫర్ట్స్ ఇచ్చే వారిని గుర్తు తెచ్చుకున్నాడు. 750 కి పైగా సినిమాల్లో నటించినా తనికెళ్ల భరణి.. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారని.. ఆయన నటన నైపుణ్యం తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ మంచి నిర్వచనం అని.. నాటకాల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ఆసక్తి సినీ రంగ ప్రవేశానికి బలమైన పునాదిగా మారినట్టు చెప్పుకొచ్చాడు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన కోట.. తన విలక్షణ నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన పాత్రలు కేవలం వినోదానికి మాత్రమే కాదు.. సామాజిక సందేశాలకు కూడా నిలువుగా ఉండేది.
ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ భరణి ఆవేదన వ్యక్తం చేశాడు. కోట శ్రీనివాస్ మరణంతో సినీ పరిశ్రమ నిశ్శబ్దంలో మునిగిపోయిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలంటూ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు. ఈ ఘటన తెలుగు సినీ అభిమానులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కోట శ్రీనివాస్.. సినీ సమర్పణ, నటన నైపుణ్యం ఎప్పటికీ అందరిలోనూ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సైతం కోట శ్రీనివాస్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనే కాదు ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సైతం కోట్టా శ్రీనివాస్‌కు నివాళులర్పించారు.