వార్ 2 vs కూలి.. రజనీ దూకుడుతో డీలా పడ్డ తారక్..!

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బాక్స్‌ఫీస్ కళ‌కళ‌లాడుతున్న సంగతి తెలిసిందే. 2025 ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించుకున్నా.. సెకండ్ హాఫ్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ కళ‌కళ‌లాడడం ఖాయం అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టులోను భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆడియన్స్‌లో వాటిపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఏడుపాదుల వయసు దాటిన లెజెండ్రీ సూపర్ స్టార్ రజనీకాంత్ తన సత్తా చాటుకున్నాడు. ప్రమోషన్స్‌లో అందరినీ అధిగమించి నెంబర్ వన్ గా నిలిచాడు. ఇది నిజంగానే సినీ ఇండస్ట్రీలో అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ఏడాది ఫస్ట్ హఫ్ ముగిసిన క్రమంలో IMDB ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో లోకేష్ క‌న‌క‌నాజ్ డైరెక్షన్‌లో రజినీకాంత్ హీరోగా నటించిన కూలి మూవీ మొదటి స్థానంలో నిలవడం అందరికీ షాక్‌ను కలిగిస్తుంది.

వార్ 2, ది రాజాసాబ్ సినిమాలను సైతం పక్కన పెట్టేసి మరి ఆడియన్స్ ఫుల్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ప్రభాస్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి సినిమాలను సైతం దాటుకుని కూలి మొదటి స్థానంలో నిలవడం అందరికి షాక్‌ను కలిగిస్తుంది. ఇది రజనీకాంత్ క్రేజ్‌కి నిలువెత్తు నిదర్శనం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక‌ ఆడియన్స్ ఎప్పటికప్పుడు కొత్తదనం, బలమైన కంటెంట్ ఉన్న సినిమాలపైనే ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే IMDB వెల్లడించిన లిస్ట్ ప్రకారం ర్యాంకింగ్ జనవరి 1 నుంచి జూలై 1 వరకు ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారి వీక్షకుల వీక్ష‌ణ‌ల‌ ఆధారంగా రూపొందింది. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్ గా సినీ ఆడియన్స్ లో నిజమైన ఆసక్తిని ఈ లిస్ట్‌ రిప్లైక్ట్‌ చేస్తుంది. ఇక సినిమా ఈ రేంజ్‌లో హైలైట్ అవ్వడానికి ప్రధాన కారణం స్టార్ కాస్టింగ్ అనడంలో అతిశయోక్తి లేదు.

Mid-2025: IMDb Announces Most Popular and Most Anticipated Indian Movies

ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా కేవలం సినిమాగా కాదు.. ఆ సినిమాకి ఈవెంట్ గా ఆడియన్స్‌ను ఆకర్షించేందుకు సిద్ధమవుతుంది. ఇక రజనీకాంత్‌తో ఈ సినిమాలో 38 సంవత్సరాల గ్యాప్ తర్వాత సత్యరాజ్ స్క్రీన్ ను పంచుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే సినిమా పై హైప్‌ అమాంతం పెరిగింది. వీళ్లిద్దరూ కలిసి గతంలో భాష లాంటి క్లాసికల్ సినిమాలో మెరిశారు. అంతేకాకుండా నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, శోభన్ షాహిద్, శృతిహాసన్, రెభా మౌనిక, అమీర్ ఖాన్ ఈ సినిమాలో న‌టించ‌డం సినిమాకు మరింత హైలెట్గా నిలిచింది. ఈ క్రమంలోనే సినిమాకు ఒక పాన్ ఇండియన్ లుక్ ఏర్పడింది. అపూర్వమైన గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంతా సినిమాను చూసేందుకు అద్భుతమైన ఉత్సాహాన్ని చూపించార‌ని తాజాగా IMDB లిస్టుపై లోకేష్ కనకరాజ‌న్‌ రియాక్ట్ అయ్యారు. లెజెండ్రీ న‌టుడు రజనీకాంత్‌ను తిరిగి కలవడం.. తెరపై మ్యాజిక్ ను సృష్టిస్తుందని.. మేము సృష్టించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. ఒకే రోజున కూలీ, వార్ 2 రిలీజై.. పోటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. సినిమా హాప్‌ ప్రీత్య రజిని.. తారక్ ను ఓడించేశాడు.