టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో టాలీవుడ్ క్యాతి రెట్టింపైంది. ఇక తాజాగా.. బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజై పదేళ్లు పూర్తైన క్రమంలోనే సినిమా టీం మొత్తం హైదరాబాద్‌లో గ్రాండ్ రీ యూనియన్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ తదితరులు హాజరై సందడి చేశారు. కానీ.. ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్స్ అయినా అనుష్క, తమన్న మాత్రం హాజరు కాలేదు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు సోషల్ మీడియాలో తమన్నా, అనుష్క మిస్సింగ్ పై చర్చలు జోరందుకున్నాయి.
ఈ రీ యూనియన్‌కు వచ్చే క్రమంలో రాజమౌళి లేదా ప్రభాస్ కారణంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అంటే రీ యూనియన్ లో కచ్చితంగా మెయిన్ లీడ్స్ హైలెట్ గా మారుతూ ఉంటారు. హీరోయిన్లకు ఇంపార్టెన్స్ లేకపోవడాన్ని వాళ్లు అవమానంగా భావిస్తారని.. అందుకే ఈ రీ యూనియన్‌లో పాల్గొనలేదంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ట్విట్టర్ ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం తమన్న హైదరాబాద్‌లో లేకపోవడంతో ఈ రీ యూనియన్‌కు రాలేదట. ఇక అనుష్క ప్రస్తుతం ఘాటీ సినిమా షూట్‌లో బిజీగా ఉంది. ఇలాంటి క్రమంలో కొన్ని వ్యక్తిగత బాధ్యతల కారణంగా ఆమె ఈ రీ యూనియన్‌కు రాలేకపోయిందని అధికారిక వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
ఘాటీ సినిమాలో అనుష్కరు చూపించేందుకు హెవీ సెట్స్ ఉపయోగిస్తున్నారని.. ఈ క్రమంలోనే ప్రస్తుతం పబ్లిక్ ఈవెంట్స్‌కు ఆమె దూరంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమా రిలీజ్ కాగానే ఆమె మీడియా ముందుకు వస్తుందట. ఇక ఇదే రీ యూనియన్‌లో రమ్యకృష్ణ ఐకానిక్ డైలాగ్.. ఇది నా మాట.. నా మాటే శాసనం.. డైలాగ్‌తో ఫోటోలో కనిపించింది. అంతేకాదు.. ప్రభాస్, రానా కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.