ఇండస్ట్రీ ఏదైనా సరే రకరకాల జోనర్లలో సినిమాలు తెరకెక్కినా.. యాక్షన్ సినిమాలకు ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సరైన యాక్షన్ కంటెంట్ ఫిలిం వస్తే చాలు.. వెండితెరపై రికార్డులు బ్రేక్ అవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల కాలంలో.. కన్నడ ఇండస్ట్రీ యాక్షన్ సినిమాలకు క్యారఫ్ అడ్రస్ గా నిలిచాయి.ఈ కోవలోనే తాజాగా కన్నడలో తెరకెక్కి టాలీవుడ్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకున్న యాక్షన్ మూవీ కేడి ద డెవిల్. కన్నడ స్టార్ ధ్రువ సర్జ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రేష్మ నానయ్య హీరోయిన్ మెరిసింది. సంజయ్ దత్, రమేష్ అరవింద్, శిల్పా శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశారు మేకర్స్.
అయితే.. ఈ ఈవెంట్లో సౌత్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలో దుమ్ములేపుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఓ రిఫోర్టర్ సంజయ్ దత్‌ను ప్రశ్నిస్తూ.. ఇక్కడ నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారని ప్రశ్నించగా.. అయన తనదైన స్టైల్ లో ఇంట్రెస్టింగ్ సమాధానాన్ని ఇచ్చాడు. ఇక్కడ నుంచి మంచి సినిమాలు చేయాలనే ప్యాషన్ బాలీవుడ్‌కు తీసుకెళ్తా. గతంలో బాలీవుడ్ లో మంచి సినిమాలు తీయాలని ప్యాషన్ ఉన్న.. ఇప్పుడు ప్రతి ఒక్కరు కలెక్షన్ల నెంబర్లపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆ ప్యాషన్ కనిపిస్తూనే ఉంది. అందుకే నాకు ఇక్కడ పనిచేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ సంజయ్ దత్ వెల్లడించాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక గత కొద్దేఏళ్లుగా బాలీవుడ్‌కి ఒక్క సరైన హిట్ కూడా లేక సతమతమతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ సినిమాలపై ఆడియన్స్ ఎక్కువ ఆశక్తి చూపుతున్నారు. దీనికి కథతో పాటు.. మూవీ నిర్మాణ విలువలు పై ఉన్న శ్రద్ధ కూడా కారణం అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు సినిమాలు ఫ్యాషన్.. ఎడ్యుకేషన్ టెక్నికల్ స్టాండర్డ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇది చూసిన బాలీవుడ్ స్టార్స్ సైతం ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో పనిచేయడానికి ఆశక్తి చూపుతున్నారు. సంజయ్ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కేజీఎఫ్ 2 లో అదిరా పాత్రలో విపరీతమైన ఇంపాక్ట్ చూపించిన సంజయ్.. ఇప్పుడు కేడి ద డెవిల్లో పవర్ఫుల్ రోల్లో మెరువనున్నారు. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్ ప్రేమ్ తెరకెక్కిస్తుండగా.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుంది.