టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదోక ట్రెండ్ కొనసాగుతూనే ఉంటుంది. సరికొత్త ట్రెండ్‌లు పుటుకొస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే కొత్త జోనర్‌లో సినిమాలను చూసేందుకు ఆడియన్స్ సైతం ఇష్టపడుతూ ఉంటారు. అలా.. తాజాగా.. టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎక్కువగా ఆదరిస్తున్న సినిమాల్లో పిరియాడికల్ జానర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు సైతం ఎక్కువగా పీరియాడికల్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా.. ప్రస్తుతం పీరియాడికల్ యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న తెలుగు స్టార్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
పవన్ కళ్యాణ్:
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా గడుపుతోనే.. మరో పక్క తాను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా.. పవన్ హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ పై పవన్ అభిమానులు సైతం భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఓ పిరియాడికల్ యాక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే.
నికిల్:
కార్తికేయ, కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నికిల్.. ప్రస్తుతం పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వయంభులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. సంయుక్త మీనన్ హీరోయిన్గా మెరవనున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది.
గోపీచంద్:
మ్యాచోస్టార్ గోపీచంద్.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. గోపీచంద్ సైతం ప్రస్తుతం సంకల్ప రెడ్డి డైరెక్షన్‌లో ఓ పీరియడికల్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇలా.. టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలు సైతం పిరియాడికల్ స్టోరీలతో సిద్ధమవుతున్నారు.