టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ప్రతి సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా, ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక వచ్చే ఏడాది మార్చ్‌లో చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు టీం. ఇక.. ఈ సినిమాలో చరణ్.. ఓ క్రికెటర్ రోల్‌లో మెరవనున్నాడు. ఇప్పటికే టీం రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో దీనిపై క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు.. ఈ గ్లింప్స్‌లో చరణ్ హుక్ షాట్స్ ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలోనే సినిమా రిలీజ్‌కు చాలా సమయం ఉన్నా బిజినెస్ ప్రారంభించేసారు మేకర్స్. అయితే.. ఈ సినిమా ఇంకా థియేటర్‌లలోకి రాకముందే.. బిజినెస్‌తో సెంచరీ కొట్టేసాడు చరణ్. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. తాజాగా.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఇంటర్నేషనల్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ డీల్ ఏకంగా రూ.110 కోట్లకు అమ్ముడుపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగుతో పాటు.. హిందీ భాషల్లోనూ సినిమా హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అన్ని భాషలకు కలిపి డీల్ క్లోజ్ చేశారని.. పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రూ.110 కోట్లు అనేది కేవలం బెస్ట్ ప్రైజ్ అని తెలుస్తుంది.
థియేటర్‌ల నుంచి వచ్చే కలెక్షన్లను బట్టి దీని రేంజ్ మరింతగా పెరగనుందని సమాచారం. ఉదాహరణకు తెలుగులో రూ.250 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు వస్తే ఓ రేంజ్‌లో.. హిందీలో రూ.100 కోట్లు కలెక్షన్లు దాటితే ఓ రెంజ్‌లో.. రూ.200 కోట్ల కలెక్షన్ దాటితే మరో రేంజ్లో ఇలా సినిమాల కలెక్షన్లను బట్టి వాల్యూ సెట్ చేయనున్నారట టీం. రూ.110 కోట్లు అనేది మినిమం డీల్ అని తెలుస్తుంది. ఇక ఇప్పటికే సినిమా ఆడియో రైట్స్.. టీ సిరీస్ దక్కించుకుంది. ఈ డీల్ వాల్యూ రూ.50 కోట్ల పైచిలుకని సమాచారం. ఈ క్రమంలోనే.. షూట్‌ను సర్వే గంగా పూర్తి చేస్తున్నారు టీం. చరణ్‌తో సహా.. ఇతర ప్రధాన తారాగరణమంతా కీలక సన్నివేశాల షూట్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చరణ్‌తో కలిసి బుచ్చిబాబు సన్నా దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.