స్టార్ హీరోయిన్ జెనీలియాకు సౌత్ఆడియన్స్ లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో పలు సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మక్కాం మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలీవుడ్ నటుడు, మాజీ సీఎం మనవడు అయినా రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక రితేష్ అప్పటికే బాలీవుడ్ లో మంచి క్రేజీ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే జెనీలియాతో కలిసి సినిమాలో నటిస్తున్న టైంలో.. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు రెండు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
ఈ క్యూటెస్ట్ కప్పుల్‌కు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాగే.. జెనీలియా భర్త ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు. తనపై ఎంతో ఆప్యాయతను కురిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రితీష్ దేశ్‌ముఖ్‌కు ఆడవాళ్లంటే ఎంతో గౌరవం. ఇది పలు సందర్భాల్లో రుజువైంది కూడా. ఓ అవార్డ్ ఈవెంట్లో జెనీలియా చేతుల మీదుగా అవార్డు అందుకుని.. ఆమె కాళ్ళని కూడా తాకాడు రితేష్. అంటే.. జెనీలియా పై అతనికి ఉన్న గౌరవం, ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు జెనీలియా సైతం రితేష్ ను అదేలా ప్రేమిస్తూ.. తనపై ఆప్యాయతను కురిపిస్తూ ఉంటుంది. అలాంటి జెనీలియా.. రితేష్ కంటే ముందే మరో హీరోని వివాహం చేసుకుందంటూ.. 14 సంవత్సరాల క్రితం ఓ వార్త తెగ వైరల్ గా మారింది.
ఈ వార్తపై తాజాగా క్లారిటీ ఇచ్చింది జెనీలియా. జెనిలియా, జాన్ అబ్రహం కలిసి ఉన్న పెళ్లి ఫోటో నెట్టింటే చక్కర్లు కొట్టడంతో వీళ్ళిద్దరికీ వివాహం అయింది అంటూ టాక్ వైరల్‌గా మారింది. అయితే.. అసలు మ్యాటర్ ఏంటంటే.. వీళ్ళిద్దరూ కలిసి ఫోర్స్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూట్ లో భాగంగా జెనీలియా.. జాన్ అబ్రహంల పెళ్లి జరుగుతుంది. అయితే నిజంగానే జెనీలియా, జాన్ అబ్రహంలకు పంతులు వివాహం చేశాడని వీళ్ళిద్దరూ ట్రెడిషనల్ గా భార్యాభర్తలు అయిపోయారంటూ ఓ టాక్ వైరల్ గా మారింది.. తాజాగా ఈ విషయంపై జెనీలియా రియాక్ట్ అవుతూ.. నేను, జాన్.. ఇద్దరం ఓ సినిమా షూట్‌లో భాగంగా పెళ్లి సీన్ చేశాం. కానీ కొంతమంది.. పంతులుగారు మాకు నిజంగానే పెళ్లి చేసేసారు అంటూ మాట్లాగారు. ఇందులో ఎలాంటి నిజం లేదని.. కేవలం సినిమా షూట్ మాత్రమే.. నటించాము అంతే.. కొంతమంది పిఆర్ లు కావాలనే ఈ ప్రచారాలు చేశారు.. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని వాళ్ళనే అడగండి అంటూ క్లారిటీ ఇచ్చింది జెనీలియా.