సాధారణ లైఫ్‌లో అమ్మ, నాన్నలతో ఎంత క్లోజ్ గా ఉన్నా.. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ను షేర్ చేసుకోలేరు. సోదరీ, సోదరులతో షేర్ చేసుకోలేని విషయాలను సైతం పలు సందర్భాల్లో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలని అంతా అనుకుంటారు. అలా క్లోజ్ ఫ్రెండ్స్ తో మొహమాటం లేకుండా ప్రతి ఒక్కటి పంచుకుంటూ ఉంటారు. ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా ఉండే స్నేహితులు ప్రతి ఒక్కరి లైఫ్ లోను ఒకరు ఉండాలని భావిస్తారు. అలా.. మెగా డాటర్ నిహారిక లైఫ్ లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారే రితిక షెరు, అంబటి భార్గవి, మహాతల్లి జాహ్నవి. ఈ నలుగురు కలిశారంటే ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు.
ఈ క్రమంలోనే తాజాగా వెతికా షేర్ నిహారికకు గ్రాండ్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసింది. తన కోసం ఏం చేయాలని ఆలోచించి.. ఓ మంచి ఐడియా చేసింది.. నిహారిక పాటరీ స్టూడియోను.. తన ఓల్డ్ ఐడియాస్‌తో అందంగా మార్చేసింది. భార్గవితో కలిసి ఆ పాటరీ గదిలోని.. ఓ గోడకు రంగులతో అలంకరించింది. తర్వాత అక్కడ ఉన్న కొన్ని వస్తువులను తీయించి.. అందంగా వాటిని డెక్కర్ చేసింది. కొన్ని పూల మొక్కల్ని కూడా ఆ గదిలో పెట్టింది. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకుంది. నిహారిక, నేను ఒకటే టీచర్ దగ్గర పాటరీ నేర్చుకున్నాం. మేము ఫ్రెండ్స్ అయ్యాక ఈ విషయం తెలుసుకున్నాం అంటూ వివరించింది. నేను కుమ్మరి పనుల్లో బేసిక్స్ మాత్రమే నేర్చుకున్నా. కానీ.. నిహారిక, భార్గవి ఇందులో డిగ్రీ చేసేసారు అంటూ వివరించింది.

ఇక నిహారికకు తెలియకుండా చేసిన ఈ చేంజస్.. ఆ పాటరి స్టూడియో కు వచ్చిన నిహారికకు సర్ప్రైజ్‌గా మారింది. తన గదిని అంత అందంగా మార్చిన వితికాను.. నిహారిక ముద్దులతో ముంచేసింది. వితికా చేసిన పనిని తెగ మెచ్చుకుంటూ మురిసిపోయింది. తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు పంచుకుంది. నీకు.. నీ ప్రేమకు.. ఏ దిష్టి తగలకూడదు అంటూ రాసుకొచ్చింది. తన ప్రేమను కాదనడం కష్టం అన్నేంతగా నన్ను ప్రేమిస్తుందని.. నా లైఫ్ అందంగా మార్చినందుకు చాలా థాంక్యూ.. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాస్తంత బాధలో ఉన్న.. కానీ నువ్వు చేసిన ఈ పని చూశాక.. నాపై కురిపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయా.. నువ్వు ఎప్పుడు నీ చుట్టూ ఉండే జనాల్ని ఎంతో స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేస్తావ్ అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. చెప్పలేనంత ప్రేమను కురిపిస్తావు. దీన్ని నేను గ్రాంటెడ్ గా తీసుకోను. నా లైఫ్ లోకి వచ్చిన నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. ఐ లవ్ యూ బేబీ అంటూ రాసుకొచ్చింది. ఇది చూసినా అభిమానులు వితికా లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం అంటూ అభిప్రాయాలన్ని వ్యక్తం చేస్తున్నారు.