సౌత్ లో కాస్టింగ్ కోచ్.. అలాంటి పనులతో టార్చర్ చేశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇప్పటికే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. గతంలోనూ ఎన్నో ఇంటర్వ్యూలో.. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ తాము.. ఎదుర్కొన్న కాస్టింగ్ ఇబ్బందుల గురించి అభిమానులతో పంచుకున్నారు. అవి సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో.. క్యాస్టింగ్ కౌచ్‌ను ఉద్దేశించి దంగల్ నటి ఫాతిమా సన్నా షేక్.. కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఈ అమ్మ‌డురియాక్ట్ అవుతూ.. నేను గతంలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఆమె చెప్పుకొచ్చింది. సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని నేను తప్పు పట్టలేదని.. ఇటీవల ఆమె వివ‌రించింది. నా వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా పోట్రే చేశారని. సౌత్ ఇండస్ట్రీ మొత్తం కాస్టింగ్ కౌచే ఉందని నేను అనలేదు.

Was Aamir and Fatima Sana Sheikh's affair ever real? : r/BollyBlindsNGossip

ఇండస్ట్రీలో నాకు ఎదురైన సంఘటనలను మాత్రమే వివరించా. నా వ్యాఖ్యలు చుట్టూ అనవసరమైన రాద్ధాంతాలు సృష్టించారు. టార్చ‌ర్ చేశారు. మహిళలకు ఏ పరిశ్రమలనైనా ఎలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. నా వ్యాఖ్యలను ఎందుకు తప్పుగా తీసుకుంటున్నారో తెలియట్లేదు అంటూ చెప్పుకొచ్చింది. నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఒక చిన్న స్థాయి కాస్టింగ్ ఏజెంట్.. లేదా నిర్మాత అనుకుంటా.. అంతేకానీ ఆ పరిశ్రమ మొత్తాన్ని నిందించడం నా ఉద్దేశం కానే కాదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. 2015 రిలీజ్ అయిన నువ్వు నేను ఒకటి అవుదాం.. అనే తెలుగు సినిమా కోసం ఫాతిమా పని చేసింది. ఈ సినిమా తర్వాత.. ఆమె థంగ‌ల్ మూవీలో భాగం అయ్యి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.

Exclusive: Fatima Sana Shaikh reveals why she left TV industry |  Filmfare.com

ఇక.. ఈ ఏడాది ఆరంభంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫాతిమా.. సౌత్ లో వర్క్ చేయడం పై మాట్లాడుతూ.. ఈ పరిశ్రమలో తనకు ఎవరైనా చేదు అనుభవాలను పంచుకుంది. సౌత్‌లో సినిమాలు చేస్తున్న రోజుల్లో.. ఒక కాస్టింగ్ ఏజెంట్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని.. సినిమా కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమేనా అని పదేపదే అడిగాడని.. మొదట్లో నాకు ఆ డబల్ మీనింగ్ అర్థం కాక పాత్ర కోసం ఎంతైనా కష్టపడతానని వివరించాన‌ని.. కానీ తర్వాత నాకు అతని మాట తీరు, విధానంలో సందేహం మొదలైందని.. దీంతో అతని మాటల్లో అర్ధాన్ని గ్రహించ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. హైదరాబాద్‌లో మరో సంఘటన ఎదుర్కొన్న.. అక్కడ కొంతమంది నిర్మాతలు హీరోయిన్స్ తో.. కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడేస్తున్నారంటూ వివరించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె దీనిపై రియాక్ట్ అయ్యిన‌ కామెంట్స్ వైరల్ గా మారాయి.