కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారిలో నిత్యమీనన్ మొదటి వరుసలో ఉంటుంది. ఇక ఇటీవల జరిగిన 70వ జాతీయ సిల్వర్ స్క్రీన్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా అవార్డును తగ్గించుకున్న నిత్యమీనన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అలాగే ఎప్పుడు నేను నటించే ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కోరుకోలేదు అంటూ వెల్లడించింది.
ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీ అలాంటిది. నేను సంతోషంగా ఉండే పాత్రలో నటిస్తేచాలని నేను భావించా. ఎంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లైనా సరే.. మసాలా సినిమాలకు నేను నో చెప్పేస్తా. ఎన్ని కోట్లు ఇచ్చిన అలాంటి పాత్రలలో నటించనంటూ చెప్పకనే చెప్పేసింది. ఆ పాత్రలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ నిత్యామీనన్ కామెంట్ చేసింది. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తా. అది ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ అంటూ తాను వెల్లడించింది. అందరూ ఫాలో అవుతున్న రూట్లోనే నేను వెళ్లాలని లేదు కదా అంటు చెప్పుకొచ్చింది.
ధనుష్ హీరోగా.. నిత్యమీనన్, రాశి ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన మూవీ తిరు (తిరుచిట్రంబళం) 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా కోలీవుడ్ తో పాటు తెలుగులోనే రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో తిరూ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాలో.. నిత్యమీనన్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఈ మూవీలో అమ్మడి అద్భుత నటనకు గాను నేషనల్ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆమె పాండిరాజ్ డైరెక్షన్లో విజయసేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే గోల్డెన్ వీసా మూవీలోను ఈమె కనిపించనుంది. దీంతో పాటు ధనుష్ సరసన ఇడ్లీకడై సినిమాలో నిత్యమీనన్ ఛాన్స్ కొట్టేసింది. ధనుష్ స్వియ డైరెక్షన్లో గ్రామీణ నేపథ్య కథతో ఇది తర్కెక్కెక్కనుంది.