రేపే ఆ స్పెషల్ పరసన్ ని కలవబోతున్నాం..లాస్ట్ మినిట్ లో మరో సూపర్ సూపర్ ట్వీస్ట్ ఇచ్చిన ప్రభాస్..!

డార్లింగ్ ప్రభాస్ ..మరోసారి తన అభిమానులను బకరా చేయబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మొన్నటికి మొన్న నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఒక్క పోస్టుతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న ప్రభాస్.. ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసాడో మనకు తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ప్రమోషన్స్ కోసమే అలా చేశాడు అన్న విషయం ఆలస్యంగా బయటపడింది . కల్కి సినిమాలో బుజ్జి అనే పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక స్క్రాచ్ వీడియోని రిలీజ్ చేసింది చిత్రం బృందం .

ఆ బుజ్జినే ఈ స్పెషల్ పర్సన్ అంటూ క్లారిటీ వచ్చింది . అయితే బుజ్జిని పూర్తిగా రివీల్ చేయలేదు . రేపు జరగబోయే ఈవెంట్ లో బుజ్జిని పూర్తిగా రివీల్ చేయబోతున్నారు కల్కి టీం. కాగా కల్కి సినిమాలో భైరవ పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్ రేపు సాయంత్రం ఐదు గంటలకి తన లైఫ్ లోకి రాబోతున్న స్పెషల్ పర్సన్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే అక్కడ స్టేజ్ సెట్టింగ్ కూడా మొత్తం రెడీ అయిపోయిందట .

హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ జరగబోతుంది. ఈ వేడుకకు టాలీవుడ్ బడాస్టార్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది . బుజ్జి అంటే సినిమాలో ప్రభాస్ పాత్ర వాడే వాహనం అంటూ తెలుస్తుంది . ఈ వాహనాన్ని రేపు అందరి ముందు అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ఈ వాహనం చాలా వెరైటీగా ఉంటుంది అని చాలా కష్టపడి ఈ వాహనాన్ని డిజైన్ చేశారు అని ..తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ బుజ్జి వైరల్ గా మారిపోయింది..!!