కొంత కాలం క్రితం ప్రముఖ నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి, సినీ నిర్మాణంపై ఆసక్తితో నిర్మాతగా మారి, అభిరుచిగల నిర్మాత అనిపించుకున్న అడ్డాల చంటి, అతి త్వరలో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కాంబినేషన్ల ట్రెండ్ నడుస్తోందని, కథల మీద కన్నా కాంబినేషన్ల మీదే హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఫోకస్ పెడుతున్నారని సునిశిత విమర్శలు చేశారాయన. ఆయన విమర్శలలో నిజాయితీ ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో కాంబినేషన్ల మీదనే సినిమా బిజినెస్ నడుస్తోంది. ఆ ట్రెండ్‌లోకి ఆయన కూడా బలవంతంగా రాక తప్పేలా లేదు. ఆయన కూడా ఓ సూపర్బ్ కాంబినేషన్‌ని సెట్ చేసుకున్నాకే మీడియా ముందుకు వచ్చినట్లు సమాచారం. ఓ ప్రముఖ హీరోతో, ఓ ప్రముఖ దర్శకుడితో అడ్డాల చంటి, వచ్చే నెలలోనే ఈ భారీ చిత్రాన్ని ప్రారంభించనున్నారట. ఆ యంగ్ హీరో, టాలీవుడ్‌కి చెందిన ఓ బిగ్ ఫ్యామిలీ మెంబర్ అని తెలియవస్తోంది. అడ్డాల చంటి, తిరిగి నిర్మాణంపై దృష్టిపెట్టడాన్ని పలువురు సినీ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. అలాగే అడ్డాల చంటి హిందీలో ఘనవిజయం సాధించిన ‘సైరత్’ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఓ పెద్ద సినిమా, దాంతోపాటే చిన్న సినిమా ఒకటి చెయ్యాలనుకుంటున్న అడ్డాల చంటి, ఇక నుంచి నిర్మాతగా బిజీ అవుతారని ఆశిద్దాం.