వేసవికాలం రాబోతుంది. అధిక ఉష్ణోగ్రతలు.. మండే ఎండలు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఇక మంచి ఆరోగ్యం కోసం వేసవిలో ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అవసరం. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు వరకు వేసవిలో బయటకు ఏదో ఒక పనులపై వెళ్లి వస్తూ ఉండడంతో.. డిహైడ్రేట్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోజు మనల్ని మనం హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే ఈ బెస్ట్ డ్రింక్స్‌ని తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయ జ్యూస్ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుతుంది. పుచ్చకాయ ఎటువంటి చక్కెర యాడ్ చేయకుండా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఒత్తిడి, అలసట దూరం అవ్వడమే కాకుండా ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ కరిగించి గుండె సమస్యలను కూడా తగ్గిస్తాయి.
అలాగే వేసవిలో లెమన్ జ్యూస్ ఒక క్లాసికల్ అండ్ రిఫ్రిషింగ్ డ్రింక్‌గా పనిచేస్తుంది. నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తీసుకుంటే థియేటర్ సమస్యకు చెక్ పెటవచ్చు. వేసవిలో వేడిని తట్టుకునే సామర్థ్యం కూడా శరీరానికి అందుతుంది. పైగా నిమ్మరసంలో జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే లక్షణాలు ఉంటాయి. ఇక అన్నిటికంటే ఉత్తమమైన పానీయాల్లో కొబ్బరినీళ్లు ఒకటి. కొబ్బరినీళ్ళలో ఎలక్ట్రోలైట్ సమృద్ధిగా ఉండి డిహైడ్రేట్ అవ్వకుండా శరీరాన్ని రక్షిస్తాయి. శరీరానికి కావాల్సిన ద్రవాలు, ఖనిజాలను తిరిగి నింపడంలో అద్భుతంగా సహకరిస్తాయి.
ఎనర్జీ బూస్టర్ గా కొబ్బరినీళ్లు పనిచేస్తాయి. ఇక రాబోయే వేసవిలో మనల్ని మనం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి తప్పక ఈ డ్రింక్ తీసుకోండి. అదేవిధంగా కీరదోస పోదీనా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా చాలా సహకరిస్తుంది. ఈ వాటర్ ఎలా తయారు చేయాలంటే.. ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు కీరదోసకాయ ముక్కలు.. 10 క్రష్ చేసిన ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి గ్లాస్ జార్ నిండా వాటర్ పోసేసుకుని బాగా కలిపి మూత పెట్టి కనీసం ఐదు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత ఈ వాటర్ ని తీసుకొని తాగడం వల్ల ఎండల తీవ్రతను తట్టుకునే సామర్థ్యం శరీరానికి అందుతుంది. వడదెబ్బ బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ఇలా సమ్మర్లో ఈ బెస్ట్ డ్రింక్స్ తీసుకొని మిమ్మల్ని మీరు ఎల్లప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.