ఆ ఒక్క తప్పు మహేశ్ జీవితాని నాశనం చేసిందా..? బయట పడ్డ నిజం..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ గతం తాలూకా సినిమాలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ గతంలో చేసిన తప్పులు గురించి పదేపదే ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్గా అలాంటి లిస్టులోకే యాడ్ అయిపోయాడు మహేష్ బాబు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు గతంలో ఎన్నో సినిమాల్లో నటించి ఫ్లాప్స్ అందుకున్నాడు .

ఫ్లాప్స్ పడినా సరే మహేష్ బాబు నటనకు కాస్త మార్కులు పడేవి . అయితే ఒక సినిమా విషయంలో మాత్రం ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోయారు . అసలు ఎందుకు అలాంటి సినిమా చేసావ్ మహేష్ బాబు అంటూ ఓ రేంజ్ లో ఏకేశారు . ఆ సినిమా మరేదో కాదు నిజం. మహేష్ బాబు కెరియర్ లోనే పరమ చెత్తగా నిలిచిన ఈ సినిమాను ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు చూసిన సరే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది .

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు పిరికివాడి పాత్రలో కనిపించడమే. ఈ సినిమా స్టార్టింగ్ లో మహేష్ బాబు ప్రతిదానికి భయం భయంగా కనిపిస్తాడు . మహేష్ లాంటి స్టార్ హీరో అలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తే ఏ అభిమాని తట్టుకుంటారు అంటూ అప్పట్లో జనాలు ఫైర్ అయ్యారు. మహేష్ బాబు సైతం ముందు వెనక ఆలోచించుకోకుండా అలాంటి తప్పు నిర్ణయం తీసుకొని ఆ సినిమా ఇచ్చిన ఫ్లాప్ తో కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు..!!