తన క్రికెట్ టీం ని పరిచయం చేసిన చెర్రీ… చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి గా…!

గ్లోబుల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా… శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ” గేమ్ చేంజర్ ” కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలు ఉన్న ఈ మూవీని మేకర్స్ డాసలు భారీగా షూట్ కంప్లీట్ చేస్తున్నారు.

ఇక గ్యాప్ ఉన్న సమయంలో రామ్ చరణ్ అయితే ఫ్యాన్స్ కి ఫాలోవర్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు. ఇండియాలో సినిమాకి మాత్రమే ఫ్యాన్స్ కాకుండా క్రికెట్ కి కూడా ఎంతోమంది ఫాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

మరి అలా షార్ట్ ఫార్మాట్ లో కొత్తగా వచ్చిన క్రికెట్ లీడ్ ” ఇండియన్ స్ర్టీట్ ప్రీమియర్ లీగ్ ” లో తన జట్టుని పరిచయం చేశాడు చరణ్. తాను తన హైదరాబాద్ టీం కి బాస్ గా సారథ్యం వహిస్తున్నట్లుగా ఓ ప్రోమోతో కన్ఫర్మ్ చేశాడు చరణ్. ఇక దీంతో చరణ్ నుంచి ఈ సర్ప్రైసింగ్ అప్డేట్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.