ప్రస్తుతం తెలుగు టెలివిజన్ షోస్ లో ఎంతో రసవక్తంగా సాగుతున్న బిగ్ బాస్ 7 ఒకటి. ఇప్పటికే 6 సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడవ సీజన్ కూడా చివరి దశలోకి చేరుకుంది. ఇక గత 6 సీజన్స్ కి లేని టిఆర్పి రేటింగ్ తో ఈ సీజన్ దూసుకుపోతుంది.
ఇక ఈ వారం గ్రాండ్ ఫినాలే ఉన్న సంగతి తెలిసిందే. కప్పు ఎవరు దక్కించుకుంటారో అని అందరూ ఒక తెలియని ఆశ్చర్యం నెలకొంది. అలాగే ప్రతి సీజన్ కి గ్రాండ్ ఫినాలే గెస్ట్ కింద ఓ స్టార్ హీరో వస్తాడు. ఇక ఈసారి ఎవరు రాబోతున్నారు అంటూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఈ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే కి.. సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ కింద రానున్నట్లు సమాచారం. ఇక ఇదే కనుక నిజం అయితే.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ పక్క రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతుంది.