ఎవ్వ‌రూ ఊహించ‌ని లుక్‌లో మెగాస్టార్‌… ఫ్యాన్స్‌కు అస‌లు కిక్ అంటే ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తో తన కెరీర్ 156వ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్ సంస్థ ఈ సినిమాని గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ” విశ్వంభర ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని భారీ సోషియో ఫాంటసీ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీపై చిరు అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక అసలు మేటర్ ఏమిటంటే… తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ని చేంజ్ చేశారు.

అయితే ఆ పిక్ లో కాకి కలర్ షర్ట్, ట్రెండీ హెయిర్ స్టైల్, బ్లాక్ కలర్ గ్లాసెస్ తో మెగాస్టార్ అదిరిపోయాడు. ఇక ముఖ్యంగా ఈ పిక్ చూస్తుంటే గతంలో చిరు నటించిన పలు సినిమాల లుక్స్ గుర్తుకొస్తున్నాయి. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన చిరు అభిమానులు…” ఏజ్ ఈజ్‌ ఎ జస్ట్ నెంబర్… అని మళ్లీ ప్రూవ్ చేశావు అన్న… నువ్వు నిజంగా కేక అంతే…” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.