టాలీవుడ్ స్టార్ యాక్టర్ స్ మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీ తో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న రవితేజ మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఈగల్ మూవీ నటిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది.
మరోవైపు అతి త్వరలోనే మహారాజ్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమా తీయబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే లేటెస్ట్ బజ్ ప్రకారం టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.. జాతి రత్నాలు, ప్రిన్స్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న అనుదీప్ కేవీతో త్వరలోనే రవితేజ ఓ సినిమాను చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఇటీవల యంగ్ డైరెక్టర్ అనుదీప్ రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపించాడని.. ఆ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో రవితేజ దాని పూర్తి స్క్రిప్ట్ గా డెవలప్ చేసుకుని రమ్మని ఆ సినిమాలో కచ్చితంగా నటిస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ క్రేజి ప్రాజెక్ట్ పట్టలేకబోతుందట దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుందని సమాచారం.