అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారడానికి పరోక్షంగా ప్రభాస్ కారణమంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది. బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ” ఆర్య ” సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2004లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అల్లు అర్జున్ కు ఈ మూవీనే స్టైలిష్ స్టార్ అని పేరు తెచ్చిపెట్టింది.
అయితే ఈ మూవీ చేయడానికి ముందు సుకుమార్ ఈ స్క్రిప్ట్ తో ప్రభాస్ ను సంప్రదించాడట. దానికి ప్రభాస్ అంగీకరించకపోవడంతో ఈ అవకాశం బన్నీకి వచ్చిందట. అంతేకాకుండా ప్రభాస్.. ఒక్కడు, బృందావనం, సింహాద్రి, కిక్, దిల్ వంటి సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడట. కాగా ఈ సినిమాలన్నీ సుకుమార్ హిట్ గా నిలిచి.. స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
అలాగే ఈ హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో ఎంచక్కా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ కు ఇప్పటికీ పెళ్లి కాలేదు. ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడంటూ తన ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇతర హీరోలకు లైఫ్ ఇచ్చిన ప్రభాస్ జీవితం మాత్రం దరిద్రంగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.