తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జిమెంట్.. హౌస్ మేట్స్ కి గట్టి క్లాస్ పీకిన నాగార్జున..!

తెలుగు బిగ్ బాస్ 7 ఇంతకు ముందు సీజన్స్ తో పోలిస్తే రోజురోజుకు మరింత రసవక్తంగా సాగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో టాస్కులు, విన్నర్, రన్నర్ తేల్చడంలో స్ట్రాటజీలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సీజన్ ఫస్ట్ కెప్టెన్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంపిక కాగా.. తాజాగా శనివారానికి సంబంధించిన ఎపిసోడ్ రిలీజ్ అయింది.

నామినేషన్ టాస్క్ లో మాదిరిగా ఓ షీట్ పై కంటిస్టెంట్ల బొమ్మలతో ఉన్న కత్తులను గుచ్చుతూ అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. వాటిని గుచ్చితే తప్పు చూపినట్లు, గుచ్చకపోతే చెయ్యనట్లు అని వివరించాడు. ముందుగా నాగార్జున ” మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది “అంటూ ప్రిన్స్, తేజను ప్రశంసించగా.. తరువాత అమర్దీప్, సందీప్ తెలివి పరాకాష్టకు చేరిందంటూ సీరియస్ అయ్యాడు.

బత్తాయి టాస్క్ లో సందీప్ మోసం చేశాడని వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అప్పుడు సంచాలకుడిగా ఉన్న అమర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగార్జున. అంతేకాదు శుభశ్రీ, ప్రియాంక, శోభ, శివాజీ ప్రతి ఒక్కరికి క్లాస్ ఇచ్చాడు నాగ్. మొత్తానికి వీకెండ్ మంచి మజా ఇచ్చింది.