ప్రతి కూతురి కోసం నాన్న పాట.. మహేష్ పోస్ట్ వైరల్..!!

ప్ర‌స్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న‌ మూవీ ” హాయ్ నాన్న “. దీనిని కొత్త డైరెక్టర్ శౌర్యువ్ రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ఫాదర్, డాటర్ సెంటిమెంట్తో తెరకెక్కనుంది. ఇప్పటికే ఇందులో నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాపై నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా హాయ్ నాన్న నుంచి సెకండ్ సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ప్రతి కూతురు కోసం నాన్న పాట అంటూ ” గాజు బొమ్మ ” లిరికల్ సాంగ్ ని ట్యాగ్‌ చేశాడు. ఇక ఈ మూవీ టీంకు స్పెషల్ విషెస్ తెలియజేసిన మహేష్ బాబు గాజు బొమ్మ‌ పాట లింక్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇక నానికి కూతురుగా ” బేబీ కియారా ” నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాకి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. నాని నటించిన జెర్సీ సినిమా కూడా తండ్రి, కొడుకు మధ్య సెంటిమెంట్ నడుమ రిలీజ్ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని నాని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది.