చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ…. అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అమర్దీప్‌ని రిక్వెస్ట్ చేస్తున్న సందీప్..!!

బిగ్ బాస్ గ్యారేజ్.. ఇచ్చట అన్ని రకాల మనుషులు ఉంటారు. కోపిస్టులు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనుడు, మంచివాళ్లు.. ఇలా అనేక రకాల మనుషులు ఉంటారు. హౌస్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఏదో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్లో ఇంటి సభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుళ్ళు.. కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఈరోజు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పాడు.

ఈ మేరకు తాజాగా రిలీజైన‌ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికి అందించారు. కానీ ఇప్పటికే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంట్లో ఉన్న వారంతా జోడి కట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ జోడిల్లో ఒక్కరు మాత్రమే ఆ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెటర్ చదివిన వారి కాప్టెన్సీస్ టాస్క్ నుంచి ముందుకు. మరొకరు టాస్క్ లో ఓడిపోతారు. చేతులారా వచ్చిన ఉత్తరాన్ని చదువుకునే భాగ్యం కూడా దక్కకుండా పోయిందని కొందరు బాధపడుతున్నారు.

ఇక సందీప్… తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని.. తనకు ఈ ఉత్తరం ఎంతో అవసరమని చెప్పాడు. మదర్ సెంటిమెంట్ ఉపయోగించేసరికి అమర్ తనతో వాదించలేకపోయాడు. అటు శుభశ్రీ సైతం తనకు ఈ లెటర్ కావాలని ఏడ్చేసింది. ఎప్పుడు నవ్వించే తేజ కూడా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకోగానే బోరుమని ఏడిచాడు. మరి ఎవరెవరికి ఉత్తరం చదివే ఛాన్సెస్ వచ్చింది? ఎవరు తమ లెటర్ ను చింపేసి త్యాగానికి సిద్ధమయ్యారు? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.