నారా బ్రాహ్మణి పెళ్లి ఫోటోలో చివ‌ర లంగోఓణిలో నుంచుని ఉన్న ఆ అమ్మాయిని గుర్తుప‌ట్టారా ..?

బాలయ్య పెద్ద కుమార్త బ్రాహ్మణిని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి ఇచ్చి వివాహం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. నారా భువనేశ్వరి స్వయంగా బాలకృష్ణ అక్క కావడంతో తన అక్క కొడుకుకి తన కూతురిని ఇచ్చి వివాహం చేశాడు. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు ప్రత్యేకతలు సంపాదించుకున్నాడు. తన నటన, డాన్స్ తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే పైన కనిపిస్తున్న బ్రాహ్మణి పెళ్లి ఫోటోలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఉండటం విశేషం. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. కానీ ఈ ఫోటోలో ప్రణతి చాలా చిన్నగా కనిపిస్తుంది.

ఇక ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం జరిగిన తరువాత వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఒక స్టార్ హీరో భార్య అయినటువంటి లక్ష్మీ ప్ర‌ణ‌తీ చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే బయటకి కూడా ఎక్కువగా రాదు. సోషల్ మీడియాలో అసలే కనిపించదు. వీళ్ళ పిల్లల బాధ్యతలు చూసుకుంటూ హ్యాపిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఈమె ప్రవర్తన చూసి నెటిజెన్లు తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.