ఎవరైనా బాడీ హెల్దీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది కండలు రావడానికి ఎంతో కష్టపడతారు. కానీ ఎటువంటి ఫలితం దొరకదు. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కండలు మీ సొంతం చేసుకోవచ్చు. ఆ 8 ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కండలు పెంచాలంటే గుడ్డు ఉండాల్సిందే. ఏదో ఒక రూపంలో రోజు మూడు పూటలా గుడ్డు తినాలి.
2. కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను ఉదయాన్నే తింటే కండరాల శక్తి పెరుగుతుంది.
3. మంచి రుచికరమైన వే ప్రోటీన్ ఎంచుకోవడం ద్వారా రుచికి.. రుచితో పాటు ఆకలి తీరుతుంది. ప్రోటీన్ అందుతుంది.
4. కండర శక్తికి క్వినోవా మంచి ఆహారం. వండిన తరువాత బ్రౌన్ రైస్లా అనిపించే ఈ ఫుడ్ చాలా మంచిది.
5. గోధుమ పిండితో చేసిన బ్రెడ్ లో మంచి ఫైబర్ ఉంటుంది. సాయంత్రం వైట్ బ్రెడ్ బదులు వీట్ బ్రెడ్ తింటే మంచిది.
6. సాధారణ నూనెల కంటే కాస్త ఖరీదైన కూడా ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. గుండెకు మేలు చేసే కొవ్వు ఇందులో ఉంటుంది.
7. తృణధాన్యాలు, నట్స్ , డ్రై ఫ్రూట్స్ తో కూడిన మ్యూస్లీ కూడా ఓట్స్ లాగే మంచి ఫైబర్ కలిగిన ఫుడ్.
8. కండరాల శక్తి కోసం జున్ను తప్పకుండా తినాలి. వెజిటేరియన్లకు చాలా వరకు ప్రోటీన్ దీని నుంచి లభిస్తుంది.