అట్లీ సినిమాలో అది ఉంటే సూపర్ హిట్.. మీరు గమనించారా..?

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లి పేరే ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన జవాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మరింత స్థాయిలో ఆయన పేరు మారుమ్రోగిపోతుంది . ఇలాంటి క్రమంలోనే అట్లీ తన సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ నీ ఫాలో అవుతున్నాడు అన్న విషయం కనిపెట్టేశారు జనాలు.

అట్లీ తన సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు.. కంటెంట్ కథ విషయంలో టూ మచ్ కేరింగా ఉంటారు . అయితే తన సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ని అదే విధంగా ఫాలో అవుతూ వస్తున్నారు . అట్లీ తెరకెక్కించే సినిమాలలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ని చంపేస్తూ వస్తున్నారు. రాజారాణి సినిమాలో హీరోయిన్గా నటించిన నజ్రియా నజీమ్ ను యాక్సిడెంట్ రూపంలో ఆమె పాత్రను ముగించేశారు .

అంతేకాదు ఆ తర్వాత తేరి సినిమాలో హీరోయిన్ సమంత గన్ షూట్ లో మరణించేలా చేస్తారు. ఆ తర్వాత మల్సర్ సినిమాలో నిత్యామీనన్ పాత్ర ఏ విధంగా మరణిస్తుందో మనకు తెలిసిందే. కాగా రీసెంట్ గా తెరకెక్కిన జవాన్ సినిమాలో సైతం దీపికా పదుకొనే పాత్రను అదే విధంగా కధానుసారం మరణించేలా చేశారు. ఇలా అట్లి తెరకెక్కించే సినిమాలో ఏ మూవీలో అయితే హీరోయిన్ చనిపోతుందో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . దీంతో ఇదేం సెంటిమెంట్ రా బాబోయ్ అంటూ కొందరు నాటీ కామెంట్స్ కూడా చేస్తున్నారు..!!