యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ష. ఇక అనుష్క నుంచి ఎన్నో ఏళ్ళు తర్వాత ఈ సినిమా వచ్చింది.
చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడం పైగా మంచి టాక్ ని కూడా సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకి ఇప్పుడు అదిరే వసూళ్లు కూడా నమోదు అవుతున్నాయి. ఒక తెలుగు స్టేట్స్ లో మాత్రమే కాకుండా యూఎస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది.
మరి ఈ సినిమా లేటెస్ట్గా యూఎస్ లో అయితే హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడు 5 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని టచ్ చేసినట్టుగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ సినిమా సాలిడ్ వీకెండ్ ని లాక్ చేస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి రాధా సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.