కరోనా సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులు నుంచి పని సౌకర్యం కలిగించాయి. అయితే ఇందులో కొన్ని కంపెనీలు ఈ విధానానికి ముగింపు పలకుగా, మరికొన్ని కంపెనీలు ఇంకా ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇంటి నుంచి పని చేయడంలో ఉద్యోగికి లాప్‌టాప్ అతిపెద్ద తోడుగా మారింది. చాలామంది ల్యాప్‌టాప్ కు సంబంధించి ఒక తప్పుని తరచుగా చేస్తూ ఉంటారు. చాలామంది తమ వర్క్ అయిపోయిన తర్వాత ల్యాప్‌టాప్‌ని షట్ డౌన్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేయడం చేస్తూ ఉంటారు. ఇది అసలు చేయకూడదు.
ల్యాప్ టాప్ ను మూసివేసినప్పుడల్లా షట్ డౌన్ చేయడి లేదా మరి ఏదైనా పని చేయాల్సి వస్తే స్లీప్ మోడ్ లో పెట్టండి. షట్ డౌన్ చేయకుండా ల్యాప్‌టాప్ ఆపిస్తే.. అది మీకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇది మీ ల్యాప్ టాప్ లో పేలుడుకు కూడా కారణం కావచ్చు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ వీడియోలో టేబుల్ పై ల్యాప్ టాప్ మూసివేయబడి ఉంది. అంతే కాకుండా.. ల్యాప్ టాప్ చార్జింగ్ లో ఉంది. అయితే సడన్గా ల్యాప్ టాప్ నుంచి పొగలు వస్తున్నాయి.
ల్యాప్ టాప్ నుంచి పొగలు రావడంతో ఓ వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అకస్మాత్తుగా ల్యాప్ టాప్ తెరవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత పొగలు మరింత ఎక్కువయ్యాయి. క్షణంలోనే ల్యాప్ టాప్ లో నుంచి మంటలు రావడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ల్యాప్ టాప్ ని తీసుకుని బయటకు విసిరేశాడు. ఈ పేలుడకు కారణాన్ని వీడియో క్యాప్షన్లో ఆ వ్యక్తి మెన్షన్ చేశాడు. అందుకే ల్యాప్ టాప్ వాడేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
View this post on Instagram