మహిళల్లో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే హార్ట్ఎటాక్ ముప్పు ఉన్న‌ట్టే…!

ఇంతకుముందు గుండెపోటు పురుషులకే వస్తుంది అనుకునేవాళ్లుం. కానీ మహిళలకు కూడా ఈ వ్యాధి పెరుగుతూ వస్తుంది. పురుషులకే కాదు స్త్రీలకు కూడా గుండెపోటు ఎక్కువ మొత్తంలో వస్తుంది. తాజాగా కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య ఇదే సమస్యతో మరణించింది. కరోనా తరువాత చిన్న వయసులోనే వచ్చే వ్యాధి గుండెపోటు. గుండెనొప్పి దాదాపు 35% పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులు, జన్యు లోపాలే దీనికి కారణం కావచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు హెల్దిగా, ఫిట్గా కనిపించినప్పటికీ గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు.

రక్తం చిక్కగా మారడం, శారీరక మానసిక ఒత్తిడితో పాటు హార్మోన్స్ ప్రభావం వల్ల గుండెపోటుతో చనిపోతున్నారు. గుండెపోటు రావడానికి మెయిన్ రీజన్ బయట ఫుడ్‌ని తినడం. అలాగే కొంతమంది బయట ఫుడ్ తినకుండా ఉన్నప్పటికీ గుండెపోటు వస్తూ ఉంటుంది. వాళ్లకి కారణం ఏమిటంటే ఆయిల్ ఎక్కువగా వాడడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఆయిల్ తక్కువగా ఉపయోగించండి. ప్రతి ఏటా ఈ సమస్య 50% పెరుగుతూ వస్తుంది. అందువల్ల తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాణాల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారుఅలాగే గుండెలో నొప్పి వస్తుంది అంటే మహిళలు, పురుషులు కూడా గ్యాస్ పెయిన్ అనుకుని లైట్ గా తీసుకుంటారు. అదే ప్రమాదానికి కారణం అవుతుంది. గుండెలో నొప్పి, ఎడమ చేయి లాగడం, బ్యాక్ పెయిన్ రావడం లాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లి టెస్ట్ చేపించుకోండి. చాలామంది గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతే వారికి మంచినీళ్లు తాగించడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం తప్పు. మంచినీళ్లు తాగించడం వల్ల ఆ ఎఫెక్ట్ గుండె మీద చూపించి వెంటనే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి గుండెపోటు వచ్చిన వెంటనే గుండెని ఒత్తిడితో ప్రెస్ చేస్తూ, శ్వాస అందించాలి అప్పుడు బతికే అవకాశం ఉంది.