టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో తెలుగు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోన్న సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ముందే లీక్ అవ్వడంతో ఈ రోజు సాయంత్రం ఈ సాంగ్‌ను పూర్తిగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ రోజు మోస్ట్ అవైటెడ్ సాంగ్‌గా వచ్చిన కళావతి సాంగ్ అదిరిపోయింది.
ఇక థమన్ ముందు నుంచే చెప్పినట్టుగా ఆల్బమ్‌లో ఫస్ట్ సాంగ్‌తోనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా స్కై రేంజ్‌ను టచ్ చేసి వదిలాడు. ప్రోమోతోనే అంచనాలు పెంచేస్తే.. ఇప్పుడు ఫుల్ సాంగ్ వింటుంటే ఆ అంచనాలు మించిపోయాయి. అసలు ఫస్ట్ టైం వినగానే ఈ సాంగ్ పిచ్చపిచ్చగా నచ్చేసేలా ఉంది. సిద్ శ్రీరామ్ గాత్రం చాలా ప్లెజెంట్‌గా ఉంది.
ఇక అనంత శ్రీరామ్ సాహిత్యంలో పదాలు.. అటు శ్రీరామ్ గాత్రం చాలా అంటే చాలా బాగుంది. థమన్ ట్యూన్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. మరో అల వైకుంఠపురంలో రేంజ్ బ్లాక్‌బస్టర్ చూడబోతున్నాం అని ఫస్ట్ సాంగ్‌తోనే క్లారిటీ వచ్చేసింది. ఫైనల్‌గా ఈ సాంగ్ ఈ ప్రేమికుల రోజు కానుకగా ప్రేమికులకు అదిరిపోయే గిఫ్ట్. మహేష్‌బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న సర్కారు వారి పాట మే 12న థియేటర్లలోకి రానుంది.