టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9.. 13వ వారం షాకింగ్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ఈ సారీ హౌస్ నుంచి సుమన్ శెట్టి లేదా సంజనా ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ రీతు ఎలివేషన్ తో హౌస్ మేట్స్‌తో పాటు బయట ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక.. రీతు రెమ్యునరేషన్ ఎంత.. ఈ 13 వారాల్లో ఎంత సంపాదించిందో ఒకసారి చూద్దాం.
హౌస్‌లో మొదటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉంటూ వచ్చింది. స్టార్టింగ్ లో నెగటివ్ ఎదుర్కొన్నా.. డిమోన్తొ లవ్ ట్రాక్ అంటూ టార్గెట్ చేసినా.. ఆడియన్స్ నుంచి వైల్డ్ కార్డ్స్ వరకు ప్రతి ఒక్కరు అన్ హెల్దీ బాండ్ వాళ్ళది అంటూ నామినేట్ చేసిన రీతే మాత్రం ఫేక్ ఎమోషన్స్ చూపించకుండా.. ఆట తీరుతో ఆకట్టుకుంది. ఎలాంటి టాస్క్‌లో అయినా.. స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు కూడా చెమటలు పట్టించింది. స్టార్టింగ్ లో విమర్శలు చేసిన వాళ్ల నుంచి క్యూట్ రీతు అనేంతల ఆడియన్స్‌ను గెలుచుకుంది.
ఈ క్రమంలోనే అమ్నడు టాప్ 5 లో నిలవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ 13వ వారం రీతు అనుహంగా ఎలిమినేట్ అయింది. కాగా రితూ.. ఈ 13 వారాలకు భారీగానే చార్జ్ చేసిందట. వారానికి రూ.2 లక్షల చొప్పున.. 13 వారాలకు రూ.26 లక్షల రెమ్యునరేషన్ రీతూ తీసుకుందని సమాచారం. ఈ క్రమంలోనే రీతూ ఛార్జ్ చేసిన రెమ్యునరేషన్ హీరోయిన్ రేంజ్ లో ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
