మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో హాస్పిటల్ డైరెక్టర్.. ఉపాసన కోణిదెలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు కూడా దాదాపు మెగా ఫ్యామిలీకి ఉన్న రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇటీవల కాలంలో ఉపాసన తరచు వార్తల వైరల్ గా మారుతుంది. తాజాగా తను మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆన్ బిజినెస్.. పురస్కారంతో గొప్ప గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఉపాసన ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్గా ఉన్న క్రమంలోనే.. ఈ అవార్డు ప్రధాన ఉత్సవానికి అటెండ్ కాలేకపోయానని వెల్లడించింది.

ఇక ఈ గుర్తింపు మరింత ఎక్కువగా కష్టపడడానికి.. నా హద్దులను అధిగమించి పని చేయడానికి.. ప్రేరణనిస్తుందని ఉపాసన వెల్లడించింది. బిజినెస్ కార్యకలాపాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఉపాసనపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే చరణ్ దంపతుల ఇంట త్వరలోనే మరో శుభవార్త వినపడనుంది. 2012లో వివాహం చేసుకున్న ఈ జంట.. 2023లో క్లీంకారకు జన్మనిచ్చారు.

తాజాగా.. మరోసారి గర్భం దాల్చిన ఉపాసన.. దీపావళి సంబరాల్లో భాగంగా తన సీమంతం ఫొటోస్ పంచుకుంది. అయితే.. డబల్ అనే పదాన్ని పదే పదే వాడుతుండడం ద్వారా ఈసారి ఆమె కవలలకు జన్మనిస్తుంది అని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని తాజాగా ఉపాసన స్వయంగా ధ్రువీకరించింది. గతంలో రెండో సంతన్న విషయంలో ఆలస్యం చేయదలచుకోలేదని.. ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇక ఈ అమ్మడు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న క్రమంలో మెగా ఫాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

