టాలీవుడ్ డిసెంబర్ : అఖండ 2 నుంచి శంభాల వరకు రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఇదే..!

2025 తుది దశ‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఇప్పటికే ఎన్నో సినిమాలు సిద్ధమయ్యాయి. ఇక.. ఈ నెలలో విభిన్న కంటెంట్‌తో సినిమాలు ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. ఆ లిస్ట్‌లో భారీ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అఖండ 2 మొదటి వరుసలో ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందడి నాలుగవ‌ వారం నుంచి మొదలవుతుంది. ఈ క్రమంలోనే పలు మీడియం రేంజ్‌ సినిమాలు క్రిస్మస్ కు రిలీజ్ కానున్నాయి. అలా.. డిసెంబర్లో రిలీజ్ కి సిద్ధమవుతున్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Most-anticipated Telugu theatrical releases of December 2025: Akhanda 2 to  Champion

అతాండ2 తాండవం:
బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. గతంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 5న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

మోగ్లీ:
రోషన్ కనకాల హీరోగా, డైరెక్టర్ సందీప్ రాజ్ రూపొందిస్తున్న మూవీ మోగ్లి. సాక్షి సాగర్ మెడల్కర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న ఆడియన్స్‌ను పలకరించనుంది.

సహ కుటుంబానాం:
మరొక టాలీవుడ్ కుర్ర హీరో రామ్ కిరణ్ నటించిన సహ‌ కుటుంబానం సైతం డిసెంబర్ 12న ఆడియన్స్ ను పలకరించనుంది.

SHAMBHALA Movie Making Video Part-1 | Aadi Sai Kumar | Archana Iyer |  Ugandhar Muni | Madhunandan

శంబాల:
చాలాకాలం తర్వాత ఆది సాయికుమార్ నటిస్తున్న మూవీ శంభాల. డైరెక్టర్ యుగంధర్ ముని రూపొందొంచిన సిఈ నిమాను సైన్స్, అతేంద్రియ శక్తుల బ్యాక్ డ్రాప్‌తో రూపొందించారు. ఈ మూవీ క్రిస్మ‌స్‌ సెలబ్రేషన్స్లో డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.

ఛాంపియన్:
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఇందులో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. ఈ సినిమా కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఆడియన్స్‌ను పలకరించనుంది.

Avatar: Fire and Ash (2025) - IMDb

దండోరా:
శివాజీ, నవదీప్, బిందు మాధవి కాంబోలో తెర‌కెక్కిన దండోరా మూవీ సైతం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.

అవతార్ 3:
ఇంటర్నేషనల్ డైరెక్టర్ జేమ్స్ కెమ‌రున్‌ లేటెస్ట్ విజువల్ వండర్ మూవీ అవతార్ 3. ఇప్పటికే రెండు సీరీస్‌లతో ఆడియన్స్‌ను పలకరించి హిట్టు అందుకున్న ఈ సినిమా.. మూడో భాగంగా అవతార్ ఫైర్ అండ్‌ యాష్ సినిమా రూపొందింది. ఈ సినిమా డిసెంబర్ 19న పాన్ వరల్డ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు.