గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్ భాషలతో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోను సత్త చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో హీరోయిన్గా మెరనపుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా.. తన కెరీర్‌లోని కఠినమైన ప్రయాణం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి.. గతంలో చేసిన ఎన్నో పెద్ద త్యాగాలు కారణమంటూ క్లారిటీ ఇచ్చింది. నా కెరీర్ ప్రారంభంలో అసలు ఎలాంటి సినిమాలు చేయాలో తెలియదు.. అవకాశం వస్తే అదృష్టమని భావించి ప్రతి ఒక్క సినిమాలోను చేసేదాన్ని. ఏ పాత్ర ఇచ్చిన నటించేదాన్ని. 20 ఏళ్ళ వయసులో నేను చాలామంది నటుల లాగా సినిమాలు సెలెక్ట్ చేసుకోలేదు. ఖాళీ లేకుండా గంటల కొద్ది పని చేస్తూ వరుస ప్రాజెక్టులను లక్ష్యంగా పెట్టుకుని వెళ్ళిపోయా.

నా పుట్టినరోజులు, పండగలే కాదు.. కనీసం కుటుంబంతో సమయాన్ని గడిపిన సందర్భాలు కూడా తక్కువే అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. నాన్న హాస్పిటల్ లో ఉన్న టైంలోనూ సైతం చివరి రోజుల్లో ఆయనతో గడపలేకపోయా. సరిగ్గా చూసుకోలేక పోయా. అది ఎంత కష్టంగా ఉండేదో నాకు మాత్రమే తెలుసు అంటూ ఎమోషనల్ అయింది. అలా.. 20 ఏళ్ల త్యాగం తర్వాత నాకు ఈ స్థానం వచ్చింది. ఇప్పుడు మాత్రం నాకు నచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. ఇండస్ట్రీలో నా ప్రయాణం పూర్తిగా మారిపోయింది అంటూ వివరించింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన కెరీర్‌ను గుర్తు చేసుకుంటూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

