నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబో లేటెస్ట్ మూవీ అఖండ 2 పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. బాలయ్య, బోయపాటి కాంబో అంటేనే కచ్చితంగా ఊర మాస్ యాశ్రీన్.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయని మైండ్లో అంత ఫిక్స్ అయిపోతారు. ఇక అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ సీక్వల్ గా వస్తున్న క్రమంలో.. సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక.. ఆడియన్స్ ఊహకు తగ్గట్టుగానే.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ ఊరమాస్ లెవెల్లో.. అసలు ఇంత అరాచకం అనేలా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక.. సినిమా డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ కానున్న క్రమంలో మేకర్స్.. కొద్దిసేపటి క్రితం సినిమాకు సంబంధించిన ఫైనల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్‌కి ఫ్యాన్స్ నుంచి బ్లాక్ బాస్టార్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న మొన్నటి వరకు.. సినిమాకు ఫ్యాన్స్ డివైడ్ రెస్పాన్స్ అందినా.. ఈ తాజా టీజర్ ఒక్కసారిగా అంచనాలను మార్చేసింది. మనిషిని తలకిందులుగా చేసి అరచేతులు పెట్టుకుని తన కూతురికి దిష్టి తీసి నేలకేసి కొట్టడాన్ని చూసిన బాలయ్య ఫ్యాన్స్ కు.. ఊరమాస్ అనిపించింది. ఈ ఒక్క సీన్‌తో మూవీ అరాచకం ఫీల్ కలిగింది. సినిమాలో వచ్చే ప్రతి ఒక్క ఎలివేషన్ ఇదే రేంజ్ లో ఉంటుందట. ఇక.. బాలయ్య, బోయపాటి సినిమా అంటేనే ఫ్యాన్స్ ఈ రేంజ్ ఎలివేషన్స్ కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు.
ఈ క్రమంలోనే సినిమాలో ప్రతి సన్నివేశం ఇంతలా గూస్ బంప్స్ తెప్పిస్తే మాత్రం.. సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కతుంది అనడంలో సందేహం లేదు. ఇక.. ఈ సినిమాలో అఖండను మించి పోయే రేంజ్ లో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ చేశాడు బోయపాటి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ రోజు 9గం..నుంచి సినిమా ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలోనే ప్రస్తుతానికి ఫస్ట్ డే కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. కొద్దిసేపట్లో ప్రీమియర్ షోస్ ఫ్రీ బుకింగ్ కూడా మొదలైపోతాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు బుక్ మై షో యాప్ ద్వారా గంటకు 16 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే.. ఓపెనింగ్స్ లోనే భారీ లెవెల్‌లో కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.



