గాడ్ఆఫ్ మాసస్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రావడం.. బోయపాటి – బాలయ్య హ్యాట్రీక్ కాంబోలో సినిమా తెరకెక్కిన క్రమంలో ఇప్పటికే సినిమాపై పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే.. సినిమాను డివోషనల్ టచ్ మాస్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారట. సనాతన ధర్మాన్ని, శివతత్వాన్ని ఆవిష్కరిస్తూ.. రుద్రతాండవం చూపిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అయితే ఆడియన్స్ను నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులతో పాటు.. సాధారణ సినీ ప్రేక్షకుల సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక.. బాలయ్య కెరీర్లోను మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ ఇది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వివరిస్తున్నాడు. ఇది సినిమాకు మరో హైలెట్ అనడంలో సందేహం లేదు. ఇక.. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. దాదాపు ఆరు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాగా.. మరి కొద్ది గంటల్లో సినిమా బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 4 నుంచే సినిమా ప్రీమియర్స్ మొదలవుతున్న క్రమంలో.. సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా బుక్ మై షో యాప్లో అఖండ 2కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సినిమా 100కే ఇంట్రెస్ట్ లు రాగా.. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓ పోస్టర్ ద్వారా దీన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇదే పోస్టర్ తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ పోస్టర్స్ సైతం.. ఆడియన్స్ను తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. బాలయ్యకు ఏ రేంజ్లో సక్సెస్ తెచ్చి పెడుతుందో చూడాలి.


