” రాజాసాబ్ ” రిలీజ్ కు నెల రోజులు ముందే రికార్డ్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆదరగొడుతుందిగా..!

ప్ర‌భాస్ టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు భారీ లెవెల్‌కు చేరుకున్నాయి. కెరీర్‌లోనే మొద‌టి రొమాంటిక్ హారర్ థ్రిల్ల‌ర్‌గా ఈ రానుంది. 2026 సంక్రాంతి బ‌రిలో జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేసినందుకు మేకర్స్‌ సన్నాహాలు చేశారు. ఇటీవల.. రిలీజైన ఈ సినిమా.. ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్.. ఇప్పటికే అభిమానుల్లో మంచి హైప్‌ ను క్రియేట్ చేసింది.

త్వరలోనే సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తే ఆడియన్స్ లో మరింత జోష్‌ను పెంచేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. అంతేకాదు.. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించేశారు. విడుదలకు ఇంకా నెలరోజుల టైం ఉన్నా.. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరు చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 100కే డాలర్లను క్రాస్ చేసింది రాజాసాబ్. అంటే ఇండియన్ రుపీస్ లో రూ.83 లక్షల పైగా వసూళ్లను రాబట్టేసింది.

ఇది నిజంగానే క్రేజ్ రికార్డ్‌. దీన్నిబట్టి అమెరికాలో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో క్లారిటీ వచ్చేసింది. రాబోయే రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాపై హైప్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా మరింత ఊప్పందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.