టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక.. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకముందే రికార్డుల మోత మొదలైపోయింది. తాజాగా.. సినిమా నుంచి ప్రమోషన్స్‌లో భాగంగా దేఖ్‌లేంగే సాలా సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్‌ను దక్కించుకొని సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లో 29.6 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకోవడం విశేషం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్.. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ రేంజ్, పర్సనాలిటీకి తగ్గట్లుగా దినేష్ మాస్టర్ ఇచ్చిన స్టెప్స్ పాటకు బాగా వర్కౌట్ అయ్యాయి అని ఫీల్ ఆడియన్స్ లో కలిగింది. డైరెక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్ల, సినిమాటోగ్రాఫర్ రవి వర్మ కృషి కూడా ఈ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు అనడంలో అతిశయోక్తి లేదు. సాంగ్ ఏ రేంజ్‌లో భారీ సక్సెస్ అందడానికి ప్రధాన కారణం హరీష్ శంకర్ మ్యూజిక్ సెలక్షన్.
గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత.. పవన్ మళ్ళీ అదే ఎనర్జీ, పవర్ఫుల్ డ్యాన్స్‌తో కనపడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. ఆ కోరికను హరీష్ నెరవేర్చడు. హరిశంకర్ మ్యూజిక్ విషయంలో చూపించిన స్పెషల్ కేర్.. ఈ సాంగ్‌కు ఆ రేంజ్ రెస్పాన్స్‌ను తెచ్చి పెట్టిందని.. ఆడియో మారిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్‌లో పాత మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేసినందుకు.. హరీష్ శంకర్‌కు మూవీ టీంకు ఫాన్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సాంగ్ రెస్పాన్స్ మూవీ టీంకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఇక ముందు.. ముందు.. సినిమా నుంచి రిలీజ్ కానున్న ప్రమోషనల్ కంటెంట్ తో హరిష్ శంకర్ ఆడియన్స్‌లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేస్తారో చూడాలి.



