నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. నిన్న(డిసెంబర్ 12)న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. రిలీజ్ కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. మొదట ప్రీమియర్ ను కంప్లీట్ చేసుకుని అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో సినిమాలో బాలయ్య రుద్రతాండవం నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. అఘోర పాత్రలో బాలయ్య లుక్స్, యాక్షన్, మాస్ డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయని.. గూస్ బంప్స్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఈ క్రమంలోనే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా భారీ లెవెల్లో వచ్చాయని మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ కొల్లగొట్టిన సినిమాగా అఖండ 2 సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కొద్ది నిమిషాల క్రితం మేకర్స్.. ఫస్ట్ డే కలెక్షన్స్ డీటెయిల్స్‌ను అఫీషియల్ గా పోస్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. అఖండ తాండవం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.59.5 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టినట్లు వెల్లడించారు.

గురువారం రాత్రి ప్రీమియర్ షోలు అలాగే.. శుక్రవారం ఫస్ట్ డే వసూళ్ల కలెక్షన్స్ అన్నింటిని కలుపుకొని రూ.59.5 కోట్ల వరకు కలెక్షన్లు దక్కాయి. ఈ క్రమంలో మేకర్స్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. దైవ గర్జన బలంగా స్పష్టంగా వినిపిస్తోంది. అఖండ 2 ఫస్ట్ డే + ప్రీవియర్లతో రూ.59.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చి గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణకు అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది అంటూ మేకర్స్ పేర్కొన్నారు. ఇక బాలయ్య గత మూవీ డాకు మహరాజ్.. మొదటి రోజు రూ.56 కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా.. ఇప్పుడు ఆ రికార్డును సైతం బాలయ్య బ్రేక్ చేస్తూ రూ.59 కోట్లు ఓపెనింగ్ కలెక్షన్స్ దక్కించుకున్నాడు.
The DIVINE ROAR is heard LOUD & CLEAR 💥💥#Akhanda2 collects a gross of 59.5 CRORES+ on Day 1 (including premieres), making it the biggest opener for God of Masses #NandamuriBalakrishna ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8l5WolzzT6#Akhanda2Thaandavam… pic.twitter.com/YpXzF1xRyE— 14 Reels Plus (@14ReelsPlus) December 13, 2025


