ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్.. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో డైరెక్టర్ బోయపాటి, బాలకృష్ణ కాంబో కూడా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి ఒక్క సినిమా అద్భుతమైన సక్సెస్ అందుకుంటుంది. అలా.. ఇప్పటివరకు సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు తెరకెక్కి మంచి హిట్లుగా నిలిచాయి. ఇక.. తాజాగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రిలీజ్ అయిన సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

అయితే.. త్వరలోనే ఈ సినిమాకు సీక్వల్‌గా జై అఖండ రూపొందుతుందంటూ.. మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. కాగా.. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కనుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. గీత ఆర్ట్స్ బ్యానర్‌లో ఇదివరకు ఒప్పందం ప్రకారం బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉందట. అయితే.. సినిమా అల్లు అర్జున్ లేదా సూర్యతో చేయాల్సి ఉండగా.. వీళ్ళిద్దరూ ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్న క్రమంలో గీత ఆర్ట్స్ బ్యానర్ తో బోయపాటి ఒప్పందాన్ని కంప్లీట్ చేయలేకపోయారు.
ఈ క్రమంలోనే బోయపాటి – బాలయ్యతో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా 2027లో సెట్స్‌పైకి రానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆ సినిమా సెట్స్‌పైకి రానుందని సమాచారం. అయితే.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న 5వ సినిమా మాత్రం జై అఖండ కాదట. ఓ సరికొత్త కథను చూపించడానికి బోయపాటి ఇప్పటికే ప్లానింగ్స్ మొదలు పెట్టేసినట్లు తెలుస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని.. కచ్చితంగా బాలయ్య – బోయపాటి ఐదవ సినిమా మాత్రం గీత ఆర్ట్స్ పైనే తెరకెక్కనుందట.

