టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత తన కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఓ ఇంటర్నేషనల్ లెవెల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక.. ఇప్పటికే సినిమాపై అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయినప్పటి నుంచి పాన్ ఇండియా లెవెల్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మొదలైంది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్‌తోపాటు.. వైవిధ్యమైన కాన్సెప్ట్ సినిమాను పవర్ ఫుల్ గా రూపొందించేందుకు.. ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మేకర్స్ స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక.. ప్రస్తుతం ఈ సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ను కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. ఇక.. తాజాగా సినిమాలో అట్లీ ప్లాన్ చేస్తున్న క్రేజి సీక్వెన్స్ గురించి ఫిలింనగర్లో వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇండియన్ హిస్టరీ లోనే మొదటిసారి అల్లు అర్జున్ సినిమా కోసం అడ్వెంచర్ చేయబోతున్నాడట. అదే మునుపెన్నడు లేని వాధంగా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తుంది. ఇప్పటివరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అండర్ వాటర్ సీక్వెన్స్లు చాలానే వచ్చినా.. వాటన్నిటికీ పూర్తి విభిన్నంగా చాలా కీలకమైన ఎపిసోడ్ గా దీనిని రూపొందించనున్నాడట అట్లీ.

ఈ క్రమంలోనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు.. భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. హాలీవుడ్ లెవెల్ టెక్నాలజీని ఉపయోగించి అక్కడి నుంచి టెక్నీషియన్లను రప్పించి మరీ.. దీనిని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లతో సినిమాలో అండర్ వాటర్ కు సంబంధించిన విజువల్స్ కనిపిస్తాయని హింట్ వచ్చేసింది. దీంతో అండర్ వాటర్ కాన్సెప్ట్‌తోనే సినిమా తెరకెక్కబోతుందని టాక్ వైరల్ గా మారుతుంది. బన్నీ, అట్లీ కాంబో మూవీతో.. అల్లు అర్జున్ మార్కెట్ మరింతగా పెరగబోతుందని.. ఈసారి ఫుల్ లెవెల్ గ్లోబల్ హీరోగా బన్నీ తెరపై కనిపించబోతున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. మరి.. ఈ సినిమాతో ఆయన ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

