టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే మన శంకర్ వరప్రసాద్ గారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రంగంలోకి దిగనుంది. ఇక.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఇద్దరు దిగ్గజ హీరోలు నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్ లో ఉన్నాయి. ఇక.. తాజాగా సినిమా షూట్ ను కూడా కంప్లీట్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే.. సంక్రాంతి బరిలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే డేట్ అనౌన్స్ చేయడానికి అనిల్ రావిపూడి తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు.

ఈ ప్రెస్ మీట్‌లో చిరు, వెంకీ కాంబోపై ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. సినిమాలో చిరు – నయనతార జంటగా నటిస్తుండగా.. వెంకటేష్ కీలక పాత్రలో మెరవనున్నారు. ఇందులో చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్లో యాక్షన్ సీక్వెన్స్ అలాగే.. ఓ సాంగ్ కూడా రానుంది. వీళ్ళిద్దరితో వచ్చే పాటపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. నాటు నాటు రేంజ్ హుక్ స్టెప్స్ ఉంటాయా.. అనే ఆత్రుత అభిమానుల్లో మొదలైంది. ఈ విషయంపై అని రావిపూడి రియాక్ట్ అయ్యారు. ఇద్దరు పిల్లల తండ్రిగా మెగాస్టార్ అప్డేటెడ్ వర్షన్.. ఈసారి బాక్సులు బద్దలే. నాటు నాటు సాంగ్స్ స్పీడ్ వేరు.. చిరు, వెంకటేష్‌లు చేసిన మన శంకర్ వరప్రసాద్ గారు సాంగ్స్ స్పీడ్ వేరు.
ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో నటించడం ఒక ఎగ్జైట్మెంట్. అలాగే ఇద్దరు కలిసి డాన్స్ చేయడం చూడాలంటే కన్నుల విందుగా ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. త్వరలోనే ఆ సాంగ్ మీ ముందుకు తీసుకొస్తాం అంటూ అనిల్ రావిపూడి వివరించాడు. అంతేకాదు.. ఈ సినిమాలో చిరు, వెంకీలతో కలిసి నేను నటించానని చెప్పుకొచ్చాడు. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ 20 నిమిషాలు బ్లాక్ చేశారని అనిల్ వివరించాడు. వాళ్ళిద్దరిని దశాబ్దాలుగా ఆడియన్స్ చూస్తున్నారు. అలా.. ఇద్దరిని ఒకే ప్రేమలో చూడాలని, చూపించాలని ఎంతో మందికి ఉంటుంది. అలాంటి అవకాశం నాకు దక్కింది. చిరంజీవి, వెంకటేష్ ఎలా ఎంటర్టైన్ చేశారనేది మీకు చూపించడానికి నేను ఎక్సయిటెడ్ గా ఎదురు చూస్తున్న. ఇక సినిమా ప్రమోషన్స్ లో వెంకటేష్, చిరు కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు.. త్వరలోనే ఒకే స్టేజిపై చూపిస్తా అంటూ అనిల్ రావిపూడి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుందని అఫీషియల్ గా వెల్లడించారు. సినిమా ప్రమోషన్స్ నెల రోజులంటాయని.. సంక్రాంతికి చిరంజీవి మ్యాజిక్ చూడబోతున్నారు.. ఫ్యాన్స్ కి ఫుల్ మజానే అంటూ అనిల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.


