హిందూ ఇతిహాస గాధలు ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా.. మళ్ళీ మళ్ళీ చూడాలి, వినాలనిపించే కథే మహాభారతం. మహాభారతంలో ఒక్కొక్క పాత్ర.. ఆ పాత్రకు ఉండే ఎమోషన్స్.. అందరికీ సరికొత్త జీవిత పాఠాలు నేర్పిస్తాయి, కొత్త అర్ధాన్ని చూపిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మహాభారతం కథతో ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. కానీ.. కోట్లాదిమంది ప్రేక్షకులు మాత్రం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయే మహాభారతం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి సినిమా పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న.. ఈ సినిమా తర్వాత.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సిరీస్ ను తెరకెక్కించాలని కష్టపడుతున్నాడట.

మహాభారతం లాంటి మహాగ్రంధం ఒకే ఒక్క సినిమాతో చెప్పేయడం కష్టం.. కనీసం 6 నుంచి 8 ఫ్రాంచైజ్ లను రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో రాజమౌళి మాట్లాడుతూ మహాభారతం ప్రాజెక్టుని కచ్చితంగా ఈ సిరీస్‌లుగా తీస్తా. ఇది కంప్లీట్ అయ్యాక సినీమాలనుంచి తప్పుకుంటానని వివరించాడు. అయితే ఈ మహాభారతం సిరీస్ ఇప్పటికే పాపులారి దక్కాంచుకున్న స్టార్ సెలబ్రిటీలను పెట్టి రూపొందిస్తాడనే బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఒకవేళ మహాభారతం మొదలు పెడితే.. శ్రీకృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబును, అర్జునుడు పాత్రలో రామ్ చరణ్, కర్ణుడిగా ప్రభాస్ ని నటింపజేసే అవకాశాలు ఉన్నాయట. ఈ క్రమంలోనే ఓ అభిమాని తన ఊహలకు రూపం ఇస్తూ.. ఏఐని ఉపయోగించి కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన ఓ సంఘటనను ఈ ముగ్గురు హీరోలపై క్రియేట్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇది ఏఐలానేఇలాగా అనిపించడం లేదని.. చాలా నేచురల్ వీడియోలో ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా కోసం యముడు పాత్రలో ఎన్టీఆర్, నకులుడిగా – నాని, సహదేవుడిగా – విజయ్ దేవరకొండను తీసుకుంటే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పాండవులకు అధిపతి అయిన ధర్మరాజుగా పవన్, భీష్మ పాత్రలో రజనీకాంత్, ద్రోణాచార్యుడిగా.. అమితాబచ్చన్, దుర్యోధనుడిగా.. రానా, ద్రౌపదిగా.. దీపిక నటిస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రాజమౌళి మహాభారతం సెట్స్‌పైకి వస్తే మాత్రం దాదాపు విషమంతా ఇలాగే ఉంటుందని.. మహాభారతం వెండిపై చూసిన తర్వాత ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వాలని.. ఆర్ఆర్ఆర్ మూవీ ఇంటర్వ్యూ టైంలో రాజమౌళి స్వయంగా చెప్పుకొచ్చాడు. మరి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. అంతలోగా ఫ్యాన్ క్రియేట్ చేసిన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మీరు ఆ వీడియోను ఓ లుక్ వేసేయండి.
#Prabhas as #Karna🥵🥵#RamCharan as #Arjuna🔥🔥@ssrajamouli pls bring it on🤯🔥🥵#AI #Mahabharat pic.twitter.com/ig3Ir6L7YJ
— Mr_Bhaddhakasthuduᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@Bhaddakasthudu) December 1, 2025

