మళ్లీ ఆ అవతారంలో బాలయ్య.. ఈసారి ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాడో..!

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవంతో బాక్సాఫీస్ సందడి మొదలైన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌లో సాలిడ్ రెస్పాన్స్ ను ద‌క్కించుక‌ని స‌క్స‌స్ ఫుల్‌గా దూసూకుపోతుంది. ఈ మూవీలో బాలయ్య మరోసారి అఘోరగా రుద్ర తాండవం చూపించాడు. ఈ క్ర‌మంలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే సినిమా అఫీషియల్‌గా ప్రారంభించారు మేకర్స్‌. ఇలాంటి క్రమంలోనే.. బాలయ్య ఈ సినిమా కోసం మళ్లీ కొత్త అవతారాన్ని ఎత్తబోతున్నాడంటూ టాక్ తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ కొత్త అవతారం మరేదో కాదు బాలయ్య మళ్ళీ సింగర్ గా మారబోతున్నాడట. గతంలో పూరి జగన్నాథ్ రూపొందించిన పైసా వసూల్ సినిమాలో ఓ సాంగ్ పాడి అందరికీ షాక్ ఇచ్చిన బాలయ్య.. ఇప్పుడు ఎన్బికె 111 కోసం మళ్లీ తన గాత్రాన్ని వినిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే గోపీచంద్ బాలయ్య తో ఎలాంటి పాటను పాటించనున్నాడు.. ఏ రేంజ్ లో ఆ సాంగ్ హైలైట్ అవ్వబోతుందో.. అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక ఇప్పటికే వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ లో వైవిధ్యమైన పాత్రల్లో మెరవనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. వృద్ధి సినిమా బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాతో.. ఆడియన్స్‌లో ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో చూడాలి.