అఖండ 2 నయా సాంగ్ రిలీజ్.. రిలీజ్ కు ముందు హార్ట్ టచింగ్ సర్ప్రైజ్..!

బాలయ్య, బోయపాటి కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం వాస్తవానికి డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. వివాదాల కారణంగా సినిమా ఆగిపోయింది. అయితే.. ఇప్పుడు అవివాదాలు అన్ని క్లియర్ చేసుకొని సినిమా రిలీజ్ కు హైకోర్టు నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే.. డిసెంబర్ 12న గ్రాండ్ లెవెల్లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ సిద్దమయ్యారు. డిసెంబర్ 11 రాత్రి నుంచి ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. అయితే.. ఈ వాయిదా కారణండా.. సినిమా విషయంలో చాలా నెగటివ్ ఏర్పడింది. ఈ క్ర‌మంలోనే ఆడియన్స్ లో సినిమాపై పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసేందుకు మేకర్స్‌ స్ట్రాంగ్గా ప్లాన్ చేశారు.

అందుకే సినిమా రిలీజ్ కు మరి కొద్ది గంటలే టైం ఉన్నప్పటికీ.. ఇంకా ప్రమోషన్స్ చేస్తూ ప్రాజెక్ట్ పై హైక్‌ను పెంచుతున్నారు. కొద్ది గంటలకు సినిమా నుంచి ఒక టీజర్‌ను రిలీజ్ చేయగా.. అది ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ టీజ‌ర్‌ దెబ్బతో సినిమాకు ఉన్న నెగెటివిటీ అంతా పోయిందంటూ అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. అయితే.. సినిమా పై మరింత హైప్ ను పెంచేందుకు, ఆడియన్స్‌కు తమ ప్రాజెక్టుతో కనెక్ట్ చేసేందుకు.. మరో అస్త్రంతో రంగంలోకి దింపారు.

JioSaavn - Listen to New & Old Indian & English Songs. Anywhere, Anytime.

తాజాగా సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేస్తూ.. ఆడియన్స్‌లో హార్ట్ టచ్చింగ్ మూమెంట్‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమాలోని.. శివ శివ అంటూ సాగే ఓ ఎమోషనల్ ఆడియో సాంగ్ వదిలారు. ఈ పాట ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ శివ శివ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది. చక్రవర్తి సాహిత్యాన్ని అందించగా.. ప్రముఖ గాయని కనకవ్వ, శృతిరంజని పాటలు ఆలపించారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ బ్లాక్ బ‌స్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం.. అది కూడా థ‌మ‌న్‌ సినిమాకు మ్యూజిక్ అందించడంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో బాలయ్య రుద్రతాండవం ఏ రేంజ్ లో ఉండనుందో చూడాలి.