అఖండ 2.. నేటి నుంచి తక్కువ రేట్లకు సినిమా చూసేయొచ్చు..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో తెర‌కెక్కిన‌ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్‌బ‌స్టర్ల తర్వాత రూపొందిన సినిమా కావడం.. దానికి తగ్గట్టు అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సంయుక్తా మీనన్ హీరోయిన్గా.. భ‌జరంగి భాయిజాన్ ఫేమ్ హర్షలీ మల్హోత్రా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది.

రిలీజ్ కు ముందు వచ్చిన ఆర్థిక సమస్యలు అన్నింటిని అధిగమించి థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక రిలీజ్‌కు ముందు ఆడియన్స్‌లో అంచనాలకు తగ్గట్లుగానే ప్రీమియర్స్‌లో సాలిడ్ కలెక్షన్స్‌లు కొల్లగొట్టి రికార్డ్‌ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే.. బాక్సాఫీస్ తాండవం స్ట్రాంగ్‌గా ప్రారంభించిన అఖండ 2 తెలంగాణలో మొదటి వారంతం అంటే మొదటి మూడు రోజుల తర్వాత సాధార‌ణ‌ టికెట్ ధరలకు అమ్ముడు పోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నేటి నుంచి అంటే డిసెంబర్ 17 నుంచి సాధారణ టికెట్ కాస్ట్‌ను ఏపీ గవర్నమెంట్ అమల్లోకి తీసుకువచ్చింది. అంటే.. నేటి నుంచి అతి తక్కువ ధరల్లో అఖండ 2ను థియేటర్లలో ఎంజాయ్ చేయొచ్చు.

నిన్న మొన్నటి వరకు భారీ ధరల కారణంగా సినిమాను వీక్షించని ఎంతోమంది ఆడియన్స్‌కు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే నార్మల్ రేట్లకు రోజు అఖండ తాండవం థియేటర్లో ఎంజాయ్ చేయడానికి చాలామంది ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. కలెక్షన్స్ విషయంలో బిగ్ ఛేంజ్ కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి.. ముందు ముందు ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.. మరింతగా అవకాశం ఉందా.. లేదా.. వేచి చూడాలి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ సీక్వెల్‌కు ఎస్. ఎస్. థ‌మన్ మ్యూజిక్ మరింత హైలెట్గా మారింది. మరి.. సినిమా ఫ్యూచర్ లో ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.