అఖండ 2 మళ్లీ పెరిగిన టికెట్ రైట్స్.. ఈసారి బిగ్ ఛేంజ్..!

సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్బస్టర్ల తర్వాత బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ కాంపలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ఇక ఈ మూవీ రిలీజ్ వాయిదా చివరికి ఓ కొలిక్కి వచ్చింది. వివాదాలు సద్దుమణికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు టీం సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే మరి కొద్ది గంటల్లో సినిమా ప్రీవియర్స్ కూడా పడనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అఖండ 2కు గుడ్ న్యూస్ చెప్పేసింది. సినిమా రిలీజ్ కు సంబంధించిన అన్ని పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. భారీ బడ్జెట్ మూవీ వస్తుందంటే టికెట్ రేట్ హైక్‌ కామన్ అయిపోయింది.

నిర్మాతలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని ప్రభుత్వం కూడా టికెట్ల హైక్ కు ఓకే చెప్పేస్తున్నారు. అయితే.. అఖండ 2 టికెట్ రేట్స్ మరోసారి పెరిగాయంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం బాలయ్య అఖండ తాండవం సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఆ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రీవియర్స్‌కు మారి కొద్ది క్షణాలే మిగిలి ఉండడంతో ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానులు సందడి మొదలు పెట్టేసారు. ఇలాంటి టైంలో అఖండ 2 టీంకు ఏపీ సర్కార్ మంచి గుడ్ న్యూస్ చెప్పింది. రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిలీజ్ డేట్ మారిన పెద్ద సమయం తీసుకోకుండా వెంటనే టికెట్ హైక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవోను పాస్ చేశారు.

Akhanda 2: Telangana ticket rate hike G.O. finally out & there's good news  for movie buffs

ఆ రేట్లు వివరాల్లోకి వెళితే.. రెగ్యులర్ రేట్లకు అదనంగా సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ 100 రూపాయలు పెంచుకునే ఛాన్స్ వచ్చింది. పెంచిన ధరలు సినిమా రిలీజ్ అయిన పది రోజుల వరకు కొనసాగుతాయని.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. దీనివల్ల ఓపెనింగ్ కలెక్షన్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వం సైతం కాస్త సమయం తీసుకున్న.. మార్చిన రిలీజ్ డేట్‌కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు జీవో పాస్ చేయడం విశేషం. ఇక ప్రస్తుతం ఈ టికెట్ రేట్ల హైక్ కారణంగా సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. అలా ప్రస్తుతం టికెట్ ధర కూ.600గా మేకప్ ఫిక్స్ చేశారు. అలాగే.. రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేలా పర్మిషన్స్ తెచ్చుకున్నారు. మొదటి రోజు ఓపెనింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో.. భారీ లెవెల్లో కలెక్షన్స్ కొల్లగొట్టనున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే ఓపెన్ బుకింగ్స్ లో బాలయ్య రుద్ర తాండవం క్లియర్ కట్ గా అర్థమవుతుంది.