బాలయ్య అభిమానులు ఎంతగానో కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూసిన అఖండ 2 తాండవం.. ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. మేకర్స్ మొదటి నుంచి ఊహించిన రేంజ్‌లో కలెక్షన్స్ అందుతున్నాయి. అమెరికాలో అయితే.. ప్రీమియర్ షోలతోనే అఖండ షేక్ చేసిపడేసిందట. కేవలం 6 గంటల్లో ప్రిమియర్లకు.. 125 కే డాలర్ల వసూళ్లు రావడం విశేషం.
ఈ రేంజ్ లో అతివేగంగా కలెక్షన్లు కొల్లగొట్టిన తొలి తెలుగు సినిమా కూడా అఖండ 2 నే. ఇక ఇప్పటివరకు ఉన్న ప్రీ సేల్స్ అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ వసూళ్ల లెక్కలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ సేల్స్‌లో మొదటి రోజు కేవలం ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా.. రూ.15.5 కోట్ల వరకు జరిగిందట. అది కూడా ఆన్లైన్ బుకింగ్స్‌తో నార్త్ అమెరికాలో ప్రి సేల్స్‌తో 250కే డాలర్లు అఖండ 2 టచ్ చేసింది. కాగా ప్రీమియర్ షోలు ప్రారంభానికి ముందే 350కే ను దాటిందని చెబుతున్నారు.
ఒక హైదరాబాదులోనే మొదటి రోజు రూ.3 కోట్లకు పైగా బుకింగ్ జరగగా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక.. ఫస్ట్ డే వసూళ్లు అఖండ కన్నా తక్కువగానే ఉన్నాయని.. పలు ట్రేడ్ రిపోర్ట్‌లు వెల్లడించాయి. అఖండ మొదటి భాగానికి తొలిరోజు రూ.21.2 కోట్ల రాగా.. అఖండ 2కు ఫస్ట్ డే దాదాపు రూ.7.43 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందట.



