అఖండ 2 ఆలస్యమే అమృతం.. రికార్డ్ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్..!

సింహా, లెజెండ్‌, అఖండ లాంటి బ్లాక్ బాస్ట‌ర్ల‌ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజై రాత్రి నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. గతవారం రిలీజ్ కావలసి ఉండగా వాయిదా పడిన ఈ సినిమా ఆడియన్స్‌లో కొత్త రిలీజ్ డేట్ పై మరింత హైప్‌ను పెంచేసింది. ఓవర్సీస్‌లో ముఖ్యంగా యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. అఖండ 2కు సంబంధించిన యు.ఎస్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్లు హార్ట్ కేకులా సేల్స్ అయ్యాయి.

మేజర్ సిటీస్ లో అయితే టికెట్లు విక్రయం మ‌రింత జోరుగా మారింది. తాజా టాక్‌ ప్రకారం కేవలం 6 గంటల్లో ఏకంగా 125 వేల డాలర్లు వసూలు వచ్చాయని తెలుగు సినీ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మార్క్‌ క్రాస్ చేసిన రికార్డ్ అఖండ 2 ద‌క్కించుకుంద‌ని తెలుస్తుంది ఇక ఈ రికార్డు దెబ్బతో బాలయ్య రేంజ్ అర్థమవుతుంది. ప్రీమియ‌ర్ షోలకోసం.. 25 డాలర్ల కొత్త ధర వ్యూహం అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఫ్యాన్స్ నుంచి.. సినీ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆఫర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ ఫేవరెట్ హీరో సినిమాలు తామే ముందుగా వీక్షించాలని ఆరాటపడుతున్నారు. ఇదే జోరుతో.. డిసెంబర్ 11 రాత్రి us లో ప్రీవియర్స్ ప్రదర్శితమవుతున్నాయి.

డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన సినిమా ఆర్దిక, న్యాయపరమైన వివాదాల కారణంగా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. ఈ సినిమా విషయంలో నెలకొన్న ఈ కన్ఫ్యూషన్ కూడా సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. బాలయ్య అభిమానుల్లో సినిమాపై ఆసక్తి పీక్స్ లెవెల్‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే అఖండ 2 ఆలస్యం కూడా బాలయ్యకు కలిసొచ్చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా 2డి, 3డి ఫార్మాట్లో రిలీజ్ కానుంది. అఖండ 2 తాండవం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న క్ర‌మంలో.. బాలయ్య బాబు రుద్ర తాండవం ఎలా ఉండబోతుందో డిసెంబర్ 12న బాక్సాఫీస్‌ బ్లాస్ట్ ఎలా ఉంటుందో చూడాలి.